Ravi Basrur: ఒక సినిమా సూపర్ సక్సెస్ సాధించాలంటే ఆ సినిమా కథ, కథనం, డైరెక్షన్ తో పాటు మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉండాలి. అలాంటప్పుడే సినిమాను చూసే ప్రేక్షకులు చాలా వరకు ఆ సినిమాలో లీనమైపోయి చూస్తుంటారు. ఎలివేషన్ సీన్ ప్రేక్షకుడికి ఎక్కాలంటే బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లే సాధ్యమవుతుంది. ఆ సీన్ లో ఉన్న ఎలివేషన్ కి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోడైతే దాని ఇంపాక్ట్ హై లెవల్ కి వెళ్తోంది. అలాగే ఎమోషనల్ సీన్లో కూడా ప్రతి ఒక్కరి చేత కన్నీళ్లు పెట్టించాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియాలో వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తున్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ ‘రవి బసురూరు’… ఆయన చేసిన కేజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే రవి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా లేకపోతే తను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని చెప్పాడు.
Also Read: లోకేష్ కనకరాజు vs నెల్సన్… ఆ డైరెక్టర్ మీద ఎందుకింత వ్యతిరేకత..?
ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసిన ఆయన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ మొత్తం అతని మ్యూజిక్ ను గుర్తించిందని తద్వారా కొన్ని అవకాశాలైతే వచ్చాయని తెలియజేశాడు. మొత్తానికైతే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన ఉగ్రం సినిమాతో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రవి ఆ తర్వాత ప్రశాంత్ నీల్ చేసిన కేజిఎఫ్ సిరీస్ అలాగే సలార్ లాంటి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు.
ముఖ్యంగా ప్రతి ఎమోషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేసే విధంగా ఆయన బిజిఎం ఐతే అందిస్తూ ఉంటాడు. ఇక అందుకే ఆయన్ని కొంతమంది దర్శకులు వాళ్ళ సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వమని అడుగుతుండటం విశేషం…ఇక ఇలాంటి సందర్భంలోనే రవి బసురూరు మాట్లాడుతూ ప్రశాంత్ నీల్ వల్లే తను ఈ స్టేజిలో ఉన్నానని చెప్పాడు.
8 వ తరగతి ఫెయిల్ అయిన నేను ఇప్పుడు ఇలాంటి ఒక టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లేస్ లో ఉన్నానంటే అది కేవలం ప్రశాంత్ నీల్ సాధ్యమయింది. ఆయన లేకపోతే నేనులేను అంటూ మాట్లాడుతూ ఉండడం విశేషం…ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాకి కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడం విశేషం… ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుందని కే జి ఎఫ్, సలార్ ను మించి ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేస్తుందని రవి చెప్పాడు…