https://oktelugu.com/

Prabhas Pournami Movie: బట్టలు లేకుండా శృంగార సన్నివేశం… నావల్ల కాదని పారిపోయిన ప్రభాస్!

దర్శకుడు ప్రభుదేవా ప్రభాస్ హీరోగా పౌర్ణమి తెరకెక్కించారు. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న పౌర్ణమి కమర్షియల్ గా ఆడలేదు. ఈ మూవీలో త్రిష, ఛార్మి హీరోయిన్స్ గా నటించారు. ప్రభాస్ రోల్ రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగి ఉంటుంది. ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చే అమ్మాయిగా త్రిష కనిపించారు. ఆ అమ్మాయిని ప్రేమించే పెద్దింటి అబ్బాయి పాత్ర ప్రభాస్ చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 25, 2023 / 04:23 PM IST

    Prabhas Pournami Movie

    Follow us on

    Prabhas Pournami Movie: ప్రభాస్ బహుసిగ్గరి. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా మీడియా ముందుకు రావాలంటే భయపడతాడు. ఇతర ఈవెంట్స్ లో ససేమిరా పాల్గొనరు. తన చిత్రాల ప్రొమోషన్స్ కి తప్పదు కాబట్టి మీడియా సమావేశాలకు వస్తారు. షూటింగ్ సెట్స్ లో కూడా ప్రభాస్ ఇదే తరహా ప్రవర్తన కలిగి ఉంటారట. కొన్ని రకాల సన్నివేశాలు చేసేందుకు ప్రభాస్ ఇబ్బంది పడతారట. పౌర్ణమి మూవీలో ఓ శృంగార సన్నివేశంలో నటించాల్సి ఉండగా… ప్రభాస్ డైరెక్టర్ కి చుక్కలు చూపించాడట. ఎంతకీ చేయనంటూ చుక్కలు చూపించాడట.

    దర్శకుడు ప్రభుదేవా ప్రభాస్ హీరోగా పౌర్ణమి తెరకెక్కించారు. మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న పౌర్ణమి కమర్షియల్ గా ఆడలేదు. ఈ మూవీలో త్రిష, ఛార్మి హీరోయిన్స్ గా నటించారు. ప్రభాస్ రోల్ రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగి ఉంటుంది. ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చే అమ్మాయిగా త్రిష కనిపించారు. ఆ అమ్మాయిని ప్రేమించే పెద్దింటి అబ్బాయి పాత్ర ప్రభాస్ చేశారు. ఈ మూవీలో ప్రభాస్-త్రిష మధ్య ఓ బోల్డ్ సన్నివేశం ఉంటుంది. ఆ సీన్లో ప్రభాస్ చొక్కాలేకుండా నటించారు.

    ప్రభాస్ తో ఆ చొక్కా తీయించేందుకు ప్రభుదేవా చాలా కష్టపడాల్సి వచ్చిందట. పర్లేదు చొక్కాతోనే ఈ సీన్ చేద్దామని ప్రభాస్ అన్నారట. కాదు సహజంగా రావాలంటే చొక్కా తీయాల్సిందే అని ప్రభుదేవా పట్టుబట్టాడట. ప్రభాస్ ఒప్పుకోకపోవడంతో మూడు రోజులు షూటింగ్ వాయిదా పడిందట. ఇక లాభం లేదని పెదనాన్న కృష్ణరాజును కలిసి విషయం చెప్పారట. ఆయన ప్రభాస్ కి నచ్చజెప్పడంతో పాటు ధైర్యం చెప్పి పంపారట. ఇబ్బంది పడుతూనే ప్రభాస్ ఆ సీన్ పూర్తి చేశాడట.

    అలాగే కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన చక్రం మూవీలో… ప్రభాస్ ఓ సీన్లో హిజ్రా వలె చేయాలి. అది కూడా కాలనీలో చాలా మంది మధ్య. ఆ సీన్ చేయడానికి ప్రభాస్ చాలా సిగ్గుపడిపోయాడట. కృష్ణవంశీ మాట కాదనలేక కంప్లీట్ చేశాడట. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ప్రభాస్ ఓ సన్నివేశంలో డైలాగ్ చెప్పలేక ఇబ్బందిపడ్డాడట. ఆ సన్నివేశంలో కె విశ్వనాథ్ కూడా నటించారట. ప్రభాస్ పరిస్థితి చూసి.. అదేంటయ్యా ఆర్టిస్ట్ అంటే డైలాగ్ ఓపెన్ గా చెప్పాలి. సిగ్గుపడితే కుదరదు అని చెప్పాడట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి.