Vidadala Rajini
Vidadala Rajini: రాజకీయాల్లో కొందరు సులువుగా రాణిస్తారు. మరికొందరు సుదీర్ఘకాలం పోరాడుతారు. మొదటి కోవకు చెందిన వారే మాజీమంత్రి విడదల రజిని. 2019 ఎన్నికల్లో తొలిసారిగా చిలకలూరిపేట నుంచి పోటీ చేసి గెలిచారు రజిని. అప్పటివరకు ప్రత్తిపాటి పుల్లారావు వెంట నడిచిన ఆమె.. ఆయన పైనే పోటీ చేసి గెలిచి చూపించారు. జైంట్ కిల్లర్ గా నిలిచారు.తెలుగుదేశం పార్టీలో చేరారు రజిని. ప్రత్తిపాటి పుల్లారావు అనుచరురాలుగా కొనసాగారు. ఆ సమయంలోనే మహానాడు వేదికగా రజిని ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా నిలిచింది. మీ సైబరాబాద్ మొక్కను అంటూ ఆమె చెప్పిన తీరు చంద్రబాబును సైతం ఆకట్టుకుంది. అయితే సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు జగన్ పిలుపుతో వైసీపీలో చేరారు రజిని. అప్పటివరకు చిలకలూరిపేట వైసిపి ఇన్చార్జిగా ఉన్న మర్రి రాజశేఖర్ తప్పించిన జగన్.. రజనీకి బాధ్యతలు కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చారు. ప్రత్తిపాటి పుల్లారావుపై అనూహ్య విజయం సాధించారు రజిని. సంచలనం సృష్టించారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా రజనీకి ఛాన్స్ ఇచ్చారు జగన్. ఏకంగా వైద్య ఆరోగ్యశాఖను కట్టబెట్టారు. అయితే మంత్రిగా ఉంటూ అనేక వివాదాలను కోరి తెచ్చుకున్నారు. దందాలకు తెరతీసారన్న ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నియోజకవర్గ మార్పు అనివార్యంగా మారింది. ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి తప్పించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించారు. అయినా సరే భారీ ఓట్ల తేడాతో అక్కడ ఓడిపోయారు.
* విడదల రజిని గట్టి ప్రయత్నం
అయితే ఎన్నికల్లో 80 మంది వరకు అభ్యర్థులను మార్చారు జగన్. ప్రస్తుతం ఓడిపోయిన వారే ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. అయితే తాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఉండనని.. చిలకలూరిపేట వస్తానని రజిని పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే చిలకలూరిపేట వైసీపీ క్యాడర్ మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఏకంగా హై కమాండ్కు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. ఆమె వస్తే పార్టీ పూర్తిగా నాశనం అయిపోతుందని.. 2019 ఎన్నికల్లో కేవలం జగన్ ప్రభంజనంలో మాత్రమే ఆమె గెలిచారని గుర్తు చేస్తున్నారు వైసీపీ సీనియర్ నేతలు. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత రజనీ పూర్తిగా మారిపోయారని.. సొంత పార్టీ శ్రేణులను సైతం నిర్లక్ష్యం చేశారని గుర్తు చేసుకుంటున్నారు.
* రాజశేఖర్ ని కొనసాగించాలి
ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా మర్రి రాజశేఖర్ ఉన్నారు.ఎన్నికల్లో ఆయనకు సైతం టికెట్ దక్కలేదు. గుంటూరు ప్రాంతానికి చెందిన నేతను తీసుకువచ్చి ఇక్కడ పోటీ చేయించారు. అయినా సరే ఓటమి తప్పలేదు. ఓడిపోయిన తర్వాత సదరు నేత జాడలేదు. అందుకే ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ ను ఇన్చార్జిగా కొనసాగించాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఆయననే కొనసాగిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థిగా మారతారని వైసీపీ మెజారిటీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. మొత్తానికి అయితే విడదల రజినిని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తుండడం విశేషం.