https://oktelugu.com/

NTR And Prashanth Neel: మూడు దేశాలను గజగజ వణికించిన వ్యక్తి జీవిత కథలో ఎన్టీఆర్..ఫ్యాన్స్ కి ఇక పండగే!

ఈ నెలలోపు అవి కూడా పూర్తి చేసి, సెప్టెంబర్ మొదటి వారం నుండే ప్రొమోషన్స్ ప్రారంభించి, సెప్టెంబర్ 27 వ తారీఖున భారీ లెవెల్ లో పాన్ ఇండియన్ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2', అలాగే కేజీఎఫ్ , సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 11, 2024 / 11:41 AM IST

    NTR And Prashanth Neel

    Follow us on

    NTR And Prashanth Neel: ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏడాదికి రెండు కచ్చితంగా ఉండేవి. కెరీర్ ప్రారంభం లో ఏడాది కి మూడు సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంత వేగంగా సినిమాలు చేసే ఆయన అరవింద సమేత చిత్రం తర్వాత స్పీడ్ బాగా తగ్గించేసాడు. అభిమానులకు ఇది నిజంగా మింగుడు పడని విషయం. #RRR చిత్రం కోసం మూడేళ్ళ కెరీర్ ని త్యాగం చేసిన ఆయన, ఆ తర్వాత ‘దేవర’ చిత్రాన్ని పూర్తి చెయ్యడానికి మరో రెండేళ్ల సమయం పట్టింది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్, అలాగే మ్యూజిక్, రీ రికార్డింగ్, డబ్బింగ్ కి సంబంధించిన వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది.

    ఈ నెలలోపు అవి కూడా పూర్తి చేసి, సెప్టెంబర్ మొదటి వారం నుండే ప్రొమోషన్స్ ప్రారంభించి, సెప్టెంబర్ 27 వ తారీఖున భారీ లెవెల్ లో పాన్ ఇండియన్ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’, అలాగే కేజీఎఫ్ , సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మరో సినిమా చెయ్యబోతున్నాడు. ప్రశాంత్ నీల్ తో చెయ్యబోయే సినిమాకి సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు రీసెంట్ గానే జరిగాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన స్టోరీలైన్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అభిమానులు ఎన్టీఆర్ ని ఆ స్టోరీ లో ఊహించుకొని ఎంతగానో మురిసిపోతున్నారు. ఈ చిత్రాన్ని 1969 సంవత్సరం లో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని చేయబోతున్నారట. ఆ సంవత్సర ప్రాంతం లో భారత్, చైనా, భూటాన్ సరిహద్దులలో ఉండే గోల్డెన్ ట్రైయాంగిల్ చిన్న ప్రాంతం ఉండేది. అక్కడ డ్రగ్స్, స్మగ్లింగ్ తో పాటు ఎన్నో అక్రమ లావాదేవీలు విపరీతంగా జరిగేవట. ఇవన్నీ ఖూన్ సా అనే వ్యక్తి పర్యవేక్షణలో, అతను కనుసన్నల్లో జరిగేవట. ఆరోజుల్లో ఓపీఎంను పెద్ద మొత్తం లో ఇతర దేశాలను స్మగ్లింగ్ చెయ్యడంతో అతనిని మయన్మార్ ఓపీఎం కింగ్ గా పిలిచేవారట. అలా చీకటి సామ్రాజ్యానికి ఏకాచక్రాధిపత్యం చేస్తున్న ఖూన్ సా అమెరికన్ డ్రగ్స్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎదురు వస్తుంది.

    ఆ సమయం లో ఖూన్ సా వారిని ఎలా తట్టుకున్నాడు, తన చీకటి సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే మిగిలిన స్టోరీ. మూడు దేశాలకు ముచ్చమటలు పట్టించిన ఖూన్ సా క్యారక్టర్ లో ఎన్టీఆర్ ఎంతో పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడట. అంతే కాదు ఈ చిత్రానికి కీ జీ ఎఫ్ సిరీస్ తో లింక్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే చిరాస్తాయిగా ఈ చిత్రం నిలిచిపోతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ని ప్రారంభించుకోబోతున్న ఈ సినిమా 2026 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.