spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Voter List Revision: దొంగ ఓట్లు అన్ని వైసిపివి అంటే ఎలా?!

AP Voter List Revision: దొంగ ఓట్లు అన్ని వైసిపివి అంటే ఎలా?!

AP Voter List Revision: ఏపీవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ సమగ్ర ఓటర్ల సవరణ ను ఆది నుంచి వ్యతిరేకిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఒక రకమైన ఆరోపణ చేస్తూ.. ఈ ప్రక్రియను మరో నెల రోజులపాటు పెంచాలంటూ కోరింది వైసిపి. ప్రతి పోలింగ్ బూత్ లో 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందని చెబుతోంది. అందుకే సర్ ప్రక్రియను మరో నెల రోజులు పెంచాలంటూ వైసీపీ నేతలు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ కు వినతి పత్రాలు అందజేశారు. అయితే ఆది నుంచి వైసీపీ ఈ ప్రక్రియ పై వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

* పక్కా పారదర్శకంగా..
కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికి వెళ్లి.. నివాసం ఉంటున్న వారిని ఓటర్లుగా పరిగణిస్తూ.. పక్కా పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో అర్హులైన ఏ ఒక్క సామాన్య పౌరుడి ఓటు పోయే అవకాశం లేదు. కానీ ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు, చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగిస్తారు. అయితే ఇలా తొలగిస్తున్న ఓట్లన్నీ తమవే అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఐదేళ్ల వైసిపి హయాంలో ప్రతి నియోజకవర్గంలో… ప్రతి బూత్ పరిధిలో 50 నుంచి 100 వరకు పైగా అక్రమంగా ఓట్లు చేర్పించారని ఆరోపణలు ఉన్నాయి. అవి ఇప్పుడు బలపడుతున్నాయి.

* వైసిపి ఆందోళన..
ఒక బూత్ పరిధిలో 50 నుంచి 100 ఓట్లు తగ్గుతుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక సమావేశమై పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు తరహాలోనే ఏపీలో కూడా విపక్షాల ఓట్లను భారీగా తొలగిస్తున్నారని.. క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక వైసీపీ నేతలు అయితే ఎలక్షన్ కమిషన్ చేసిన ప్రయత్నాన్ని తప్పుపడుతున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భయం, ఆ పార్టీ అనుమానాలు బయటపడ్డాయి. ఇప్పుడు పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తుండడంతో అవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేర్పించినవి అని అర్థం అవుతోంది.

* అప్పట్లో దొంగ ఓట్లు..
గతంలో వైసిపి హయాంలో బై పోల్స్ ఎలా జరిగాయి ఇట్టే గుర్తు చేసుకోవచ్చు. సరిహద్దు జిల్లాల నుంచి వేలాది మందిని బస్సులు, లారీల ద్వారా తరలించి ఎలా ఓట్లు వేయించుకున్నారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 6 కోట్ల నకిలీ ఓట్లను ఏరిపారేసే క్రమంలో భాగంగా.. ఏపీలోనూ గట్టి చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రత్యేక డ్రైవ్ వల్ల తప్పకుండా బినామీ, దొంగ ఓట్లకు పడుతుంది. అయితే ఇప్పుడు తమ ఓట్లు పోతాయని ఈ రాజకీయ పార్టీ అయినా ఆరాటపడితే కచ్చితంగా అనుమానం వ్యక్తం చేయవచ్చు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై అదే అనుమానం బలపడుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version