https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: అభిమాన కంటెస్టెంట్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి రాజ్ తరుణ్..ట్విస్ట్ మాములుగా లేదుగా!

లావణ్య కి సమాధానం చెప్పే ధైర్యం లేకుండా స్టూడియో నుండి పారిపోవడం, శేఖర్ మీద డిబేట్ లో చెప్పు విసరడం వంటివి చేసింది. అయితే ఎట్టకేలకు శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. బయట మనోడు పడే గొడవలు చూసి బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే విధంగా రచ్చ చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 13, 2024 / 05:26 PM IST

    Raj Tarun Lavanya

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో మొదటి రోజు నుండి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వారిలో ఒకరు శేఖర్ బాషా. రేడియో జాకీ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన, హౌస్ లోకి అడుగుపెట్టకముందు రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారం లో రాజ్ తరుణ్ కి సపోర్టుగా నిలిచి లావణ్య కు కంటి మీద కునుకు లేకుండా చేసాడు. మగవాళ్ల బలహీనతలతో ఆడుకునే కొంతమంది ఆడవాళ్ళకు శేఖర్ బాషా పూర్తిగా వ్యతిరేకం. బయట మీడియా చానెల్స్ లో ఆయన డిబేట్ స్కిల్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సానుభూతి తో నెట్టుకొచ్చి రాజ్ తరుణ్ ని ముప్పు తిప్పలు పెట్టాలని చూసిన లావణ్య ఆటలను ఒక్కసారిగా అరికట్టే ప్రయత్నం చేసాడు శేఖర్ బాషా.

    లావణ్య కి సమాధానం చెప్పే ధైర్యం లేకుండా స్టూడియో నుండి పారిపోవడం, శేఖర్ మీద డిబేట్ లో చెప్పు విసరడం వంటివి చేసింది. అయితే ఎట్టకేలకు శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. బయట మనోడు పడే గొడవలు చూసి బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే విధంగా రచ్చ చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరకు ఆయన వేసే జోక్స్ సోషల్ మీడియా లో క్రాకర్స్ లాగ పేలుతున్నాయి. అసలు ఇలాంటి అంశాలను కూడా జోక్ కోసం వాడుకోవచ్చా అనేంత శేఖర్ బాషా నవ్విస్తున్నాడు. టాస్కులు ఆడడం లో కూడా ఆయన చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ వారం ఆయన కంటెంట్ కి పెద్దగా స్కోప్ దొరకలేదు. ఈ విషయంపై శేఖర్ బాషా అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే నేడు రాజ్ తరుణ్ హీరో గా నటించిన ‘భలే ఉన్నాడే’ అనే చిత్రం విడుదలైంది. చాలా కాలం తర్వాత రాజ్ తరుణ్ సినిమాకి పాజిటివ్ పబ్లిక్ టాక్ వచ్చింది.

    అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం రాజ్ తరుణ్ గత కొంతకాలం నుండి పలు ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూస్ లో ఒక యాంకర్ రాజ్ తరుణ్ ని ఒక ప్రశ్న అడుగుతూ ‘శేఖర్ బాషా మీకు కష్టసమయం లో ఎంతో సపోర్టుగా నిలిచాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు. ఆయన మీద మీ అభిప్రాయం ఏమిటి?, ఎలా ఆడుతున్నాడు?’ అని అడగగా, దానికి రాజ్ తరుణ్ సమాధానం చెప్తూ ‘ శేఖర్ బాషా గారు బిగ్ బాస్ లోకి వెళ్లడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఆయన ఆట అదరగొడుతున్నాడు. అప్పుడప్పుడు నేను షో చూస్తూనే ఉన్నాను. ఏదైనా అవకాశం వస్తే శేఖర్ బాషా కి సపోర్టుగా హౌస్ లోకి వెళ్ళడానికి నేను రెడీ’ అంటూ రాజ్ తరుణ్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. రేపు శేఖర్ భాష భార్య ఒక బిడ్డకి జన్మని ఇవ్వనుంది, తన సినిమా ప్రొమోషన్స్ కోసం రాజ్ తరుణ్ రేపు బిగ్ బాస్ కి రావొచ్చు, శేఖర్ బాషా కి శుభవార్త చెప్పొచ్చు అని అనుకుంటున్నారు విశ్లేషకులు.