Mahesh Babu And Rajamouli: మహేష్ బాబు(Super Star Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) సినిమాకు సంబంధించి సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక ఆసక్తికరమైన వార్తలు లీక్ అవుతూనే ఉన్నాయి. రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ఏ రకమైన సమాచారం కూడా బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమాకు జరిగిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన బయటకు రానివ్వలేదు. అంత గోప్యంగా ఉంచినప్పటికీ వార్తలు లీక్ అవుతుండడం రాజమౌళి కి తీవ్రమైన అసహనం కలిగేలా చేస్తున్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈ చిత్రంలో మహేష్ బాబు క్యారక్టర్ పేరు ‘రుద్ర’ అట. సినిమాకి టైటిల్ ని కూడా అదే పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రుద్ర అనగానే మన అందరికీ ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘శక్తి’ సినిమా గుర్తుకొస్తాది. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ రుద్ర క్యారక్టర్ లో కనిపిస్తాడు.
ఈ క్యారక్టర్ అప్పట్లో పెద్ద ట్రోల్ మెటీరియల్ అయ్యింది. ఇప్పటికీ ఎన్టీఆర్ ని దురాభిమానులు ఈ క్యారక్టర్ కి సంబంధించిన సన్నివేశాలను సోషల్ మీడియా లో షేర్ చేసి ఎగతాళి చేస్తుంటారు. సినిమా కూడా ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్. ఈ సినిమాని నిర్మించిన అశ్విని దత్ నష్టాలను తట్టుకోలేక అసలు సినిమాలు తీయడమే కొన్నేళ్లు మానేసాడు. అంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలోని, ట్రోల్స్ కి గురైన క్యారక్టర్ పేరుని, ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాకు పెడుతారా?, అసలు ఈ నిర్ణయమే బాగాలేదు, దయచేసి మార్చుకోండి అంటూ సోషల్ మీడియా లో మహేష్ బాబు అభిమానులు రాజమౌళి ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. అయితే అభిమానులు అడిగారు కదా అని వెంటనే టైటిల్స్ మార్చేయడం, సినిమా స్టోరీ ని మార్చేయడం వంటివి రాజమౌళి హిస్టరీ లోనే లేదు. మహేష్ బాబు క్యారక్టర్ పేరు అయితే రుద్ర అనేది ఫిక్స్, సినిమాకి కూడా అదే టైటిల్ ని పెడుతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే ఆయన మహేష్ తో కలిసి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియా లో లీక్ అవ్వడంతో ఈ విషయం ఖరారైంది. అదే విధంగా బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి వెళ్లి, అక్కడ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో హీరోయిన్ గా, విలన్ గా చేసి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా కూడా ఈ చిత్రం లో విలన్ రోల్ చేయబోతుంది. ఈమెకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి అయ్యింది. త్వరలోనే ఒడిశా లో ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేయబోతున్నాడు రాజమౌళి. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వెయ్యి కోట్లు బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు.
Also Read: నితిన్ బాత్ రూమ్ లో దూరిన దర్శకుడు, చివరికి బెడ్ రూమ్ లోకి కూడా… ఇదంతా దాని కోసమే!