Leena Chandavarkar: సినిమా ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. అందరినీ ఆకర్షిస్తుంది. అయితే చీకటి కోణం కూడా ఉంది. ముఖ్యంగా హీరోయిన్స్ పరిశ్రమలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యక్తిగత కారణాలు కూడా ఒక్కోసారి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాగా ఓ హీరోయిన్ ఫార్మ్ లో ఉన్నప్పుడే పెద్దలు పెళ్లి చేశారు. తీరా చూస్తే ఏడాది లోపే భర్త మరణించాడు. దాంతో ఆమె ఓ హీరోకి నాలుగో భార్య కావాల్సి వచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు లీల చందావర్కర్. ఈమె అప్పటి మైసూర్ స్టేట్ లో గల ధర్వాడ్ లో జన్మించింది.
మోడలింగ్ కెరీర్ గా ఎంచుకున్న లీల చందావర్కర్ ఫిల్మ్ ఫేర్ నిర్వహించిన ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్స్ లో విజేతగా నిలిచింది. ఆ విధంగా ఆమె పేరు పాప్యులర్ అయ్యింది. పలు వ్యాపార ప్రకటనల్లో ఆమె నటించారు. అనంతరం సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. 1968లో విడుదలైన మన్ కా మీట్ ఆమె డెబ్యూ మూవీ. రెండేళ్ల గ్యాప్ తర్వాత 1970లో సాస్ బీ కభీ బహు భీ తీ చిత్రం చేసింది. సంజయ్ ఖాన్ హీరోగా నటించాడు.
1975లో లీల చందావర్కర్ కి పెద్దలు సంబంధం చూసి పెళ్లి చేశారు. అప్పటికి ఆమె వయసు 24 ఏళ్ళు. మరాఠి పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన సిద్ధార్థ్ బండోద్కర్ తో ఏడు అడుగులు వేసింది. సిద్దార్థ్ తండ్రి దయానంద్ బండోద్కర్ గోవా, డామన్ అండ్ డయ్యు కి మొదటి ముఖ్యమంత్రి కావడం విశేషం. పెళ్ళై ఏడాది గడవక ముందే సిద్ధార్థ్ కన్నుమూశాడు. భర్త మరణం తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో నటించింది.
అనంతరం 1980లో నటుడు, సింగర్ కిషోర్ కుమార్ ని వివాహం చేసుకుంది. అప్పట్లో కిషోర్ కుమార్ స్టార్ హీరో. పాప్యులర్ సింగర్. ఆయన ముగ్గురు హీరోయిన్స్ ని వివాహం చేసుకున్నారు. వారిలో మధుబాల మరణించారు. ఇద్దరితో విడాకులు అయ్యాయి. నాలుగో భార్యగా లీల చందావర్కర్ ని చేసుకున్నారు. అయితే పెళ్ళైన ఏడేళ్ళకే 1987లో కిషోర్ కుమార్ మరణించారు. వీరికి ఒక అబ్బాయి సంతానం.
లీల చందావర్కర్ అటు సిల్వర్ స్క్రీన్ కి కూడా దూరమైంది. 1989లో విడుదలైన మమత కీ చాన్ మైన్ ఆమె చివరి చిత్రం. రెండు పెళ్లిళ్లు చేసుకున్న లీల చందావర్కర్ ఇద్దరు భర్తలతో కనీసం పదేళ్ల వైవాహిక జీవితం కూడా అనుభవించలేదు. ప్రస్తుతం కుమారుడితో ఒంటరిగా జీవిస్తుంది. లీల చందావర్కర్ కొడుకు పేరు సుమీత్ కుమార్. ఇతడు సింగర్ అలాగే మ్యూజిక్ కంపోజర్.