Kondapalli Raja Movie: సినీ ఇండస్ట్రీ అంటే ఓ మాయ ప్రపంచం. వింతలు, విశేషాలు చోటు చేసుకునే పరిశ్రమ. రంగులు అద్దుకుని జనాలకు వినోదాన్ని అందించేందుకు ఇక్కడ పనిచేసేవారు ఎంతో శ్రమపడుతారు. తెరపై మూడు గంటలు మాత్రమే నడిచే ఓ సినిమా తయారు కావాలంటే సంవత్సరాలు పడుతుంది. డబ్బు, శ్రమతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి జీవితాలు కూడా అగమ్యగోచర పరిస్థితిలో పడొచ్చు. వీటన్నింటిని తట్టుకుని నిలబడితేనే సినీ ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా..ఒక్కోసారి హీరోలు, దర్శకుల మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. అంతేకాకుండా వివాదాలు సృష్టిస్తాయి. అలాంటి వివాదం పాత రోజుల్లో ఒకటి ఏర్పడింది. దీంతో హీరోల మధ్య గ్యాప్ ఏర్పడింది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణలు సమాన స్థాయిలో టాప్ ప్లేసులో కొనసాగారు. అయితే ఒకరి సినిమాల్లో ఒకరు నటించరు. ఒకరు ఒప్పుకున్న సినిమా మరొకరు చెయ్యరు. అప్పట్లో డైరెక్టర్లు సైతం హీరోలతో సినిమాలు చేసే విషయాల్లో ఎక్కడి మిస్టేక్ జరుగుతుందోనని తెగ భయపడేవారు. ఎందుకంటే ఆ కాలంలో టాప్ హీరోలతో సినిమాలు చేయడమంటే సినిమా దాదాపు సక్సెస్ బాటగానే కొనసాగుతుందని భావించేవారు. అందుకే మంచి కథ దొరకగానే టాప్ హీరోల కోసం వెయిట్ చేసేవారు. వారి కాల్షీట్ల ఆధారంగానే సినిమాలు తీసేవారు.
Also Read: Heroes Who Married Item Girls: ఐటమ్ సాంగ్స్ చేసేవారిని వివాహం చేసుకున్న హీరోలు వీరే
అలనాటి దర్శకుల్లో కే. రాఘవేంద్రరావు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమాలు దాదాపు సక్సెస్ అయినవే. ఆయన తీసిన సినిమాల్లో ‘కొండపల్లి రాజా’ ఒకటి. ఈ సినిమాలో వెంకటేశ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో అప్పుడు హీరోగా కొనసాగుతున్న సుమన్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఏర్పడిన వివాదం ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. ఆ తరువాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వాస్తవానికి ఈ సినిమాలో హీరో చిరంజీవి చేయాల్సి ఉందట. అసలేం జరిగిందంటే..?
కేవీబీ సత్యనారాయణ అనే డైరెక్టర్ రజనీకాంత్ నటించిన అన్నామలై సినిమా రైట్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చాడు. ఈ క్రమంలో చిరు కలిసిన అన్నామలై స్టోరీ వినిపించాడట. ఈ కథ నచ్చడంతో చిరు ఓకే చెప్పాడట. అప్పటికే సుందరకాండ సెట్స్ లో ఉన్న వెంకటేశ్ దగ్గరికి వచ్చిన కేవీబీ అన్నామలై ఇదే కథ గురించి చెప్పాడు. దీంతో ఆ సినిమా మనమే చేద్దామని వెంకటేశ్ అన్నాడట. దీంతో కేవీబీకి ఏం చేయాలో అర్థం కాలేదు. చిరును వదులుకోవాలా..? వెంకటేట్ ను వద్దనాలా..? తెలియక అయోమయంలో పడ్డాడట.. మొత్తానికి కాస్త ధైర్యం తెచ్చుకున్న కేవీబీ చిరుతో ఈ విషయం చెప్పాడట. దీంతో చిరు కూడా వెంకటేశ్ తోనే ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పాడట. ఆ తరువాత కొండపల్లి రాజా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఇదిలా ఉండగా.. 1987లో ఉదాగస్ అనే నవల అధారంగా హిందీలో ఓ సినిమా తీశారు. ఈ సినిమా రైట్స్ ను కృష్ణం రాజు తీసుకొని తెలుగులో ‘ప్రాణ స్నేహితులు’ అనే సినిమాను తీశారు. ఆ తరువాత మళ్లీ ఇదే కథను కొండపల్లి రాజా పేరుతో తీయడం వివాదమైంది. దీంతో కృష్ణం రాజు ‘కొండపల్లి రాజా’ యూనిట్ పై కేసు వేశారు. కానీ పెద్దల జోక్యంతో రాజీ కుదర్చారు. మొత్తానికి కొండపల్లి రాజా సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచింది. ఇది కేసులకు దారితీసింది.
Also Read:Sai Pallavi SVP Movie : మహేష్ బాబు మూవీ చూసేందుకు మారువేషంలో వచ్చిన సాయిపల్లవి.. వైరల్ వీడియో
Recommended Videos