https://oktelugu.com/

Jagapathi Babu: జగ్గూభాయ్ సినిమాల్లోకి రాకుంటే ఏం అయ్యేవారో తెలుసా?

జగ్గూభాయ్ తన లైఫ్ స్టైల్ కు సంబంధించిన పోస్టులు ఫుల్ గా పెడుతుంటారు. అంతేకాదు ఈయన చేసే ఫన్నీ పోస్టులు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా జగ్గూభాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 18, 2024 / 10:20 AM IST

    Jagapathi Babu

    Follow us on

    Jagapathi Babu: ఒకప్పుడు హీరోల్లాగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగులుతుంటారు కొందరు. అందులో జగపతి బాబు ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ స్టార్ నటుడు విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. ఇక యాక్టర్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఈయన ఏదైనా పోస్టు పెడితే చాలు నెటిజన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంటుంది.

    జగ్గూభాయ్ తన లైఫ్ స్టైల్ కు సంబంధించిన పోస్టులు ఫుల్ గా పెడుతుంటారు. అంతేకాదు ఈయన చేసే ఫన్నీ పోస్టులు కూడా తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా జగ్గూభాయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. అయితే తను పోలీస్ గెటప్ లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేస్తూ.. నేను సినిమాల్లోకి రాకపోతే.. మంచి పోలీస్ అయ్యేవాడిని.. అంతేకాదు ఇప్పుడున్న పోలీసుల మాదిరి నేను కూడా లా అండ్ ఆర్డర్ ను గడగడలాడించేవాడిని ఏం అంటారు? అంటూ ఫన్నీగా రాసుకొచ్చారు.

    ఈ పోస్టుకు అభిమానుల నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. ఏమంటాము జగ్గూభాయ్.. తగ్గేదేలే అంటామని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ లుక్ బాలీవుడ్ సినిమా రుసలాన్ అనే సినిమాకు సంబంధించింది. ఇందులో జగపతి బాబు. పోలీస్ లాగా తన యాక్షన్ చూపించబోతున్నారు. అయితే ఈ సీనియర్ యాక్టర్ ఇప్పటికే చాలా సార్లు పోలీస్ పాత్రలను చేశారు. హీరోగా ఉన్నప్పుడు పోలీస్ పాత్రలు మంచి సక్సెస్ లను అందించాయి.

    సపోర్టింగ్ రోల్స్ చేస్తున్న సమయంలో కూడా పోలీస్ పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. ఇక సూపర్ పోలీస్ అవడం తన డ్రీమ్ అని.. అందుకే ఆ డ్రీమ్ ను ఇలా పాత్రలు తీరుస్తున్నాయి అంటూ టాక్. ఈయన టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా ప్రాజెక్స్ట్ అయిన సలార్ 2, పుష్ప 2, కంగువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు జగ్గూభాయ్.