Homeఎంటర్టైన్మెంట్Jabardasth Ramprasad: జబర్దస్త్ కి రాకముందు ఆటో రాంప్రసాద్ ఏం చేసేవాడో తెలుసా? స్టార్...

Jabardasth Ramprasad: జబర్దస్త్ కి రాకముందు ఆటో రాంప్రసాద్ ఏం చేసేవాడో తెలుసా? స్టార్ రైటర్ బయటపెట్టిన అసలు నిజం

Jabardasth Ramprasad: జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఆటో రాంప్రసాద్ ఒకరు. ప్రస్తుతం కమెడియన్ గా, స్క్రిప్ట్ రైటర్ గా రాణిస్తున్నాడు. ఆటో పంచులు వేస్తూ కడుపుబ్బా నవ్విస్తుంటాడు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తో కలిసి స్కిట్స్ చేసేవాడు. ఈ ముగ్గురు స్టేజి పై ఉంటే ఆ కిక్కే వేరు. వాళ్ళ కాంబినేషన్ లో స్కిట్స్ చూడటానికి ఆడియన్స్ చాలా ఇష్టపడేవారు. అలా వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. కాగా సుధీర్, శ్రీను సినిమాలు చేస్తూ బిజీ కావడంతో జబర్దస్త్ కి దూరమయ్యారు.

దీంతో రాంప్రసాద్ ఒక్కడే టీం ని లీడ్ చేస్తున్నాడు. బుల్లితెర పై శ్రీ దేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, స్పెషల్ ఈవెంట్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అలాగే సినిమాల్లో కూడా నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రాంప్రసాద్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. మొదటి సినిమా చేసిన మూడేళ్లకు కూడా ఆఫర్లు రాకపోవడంతో .. ఆ కష్టాలు పడలేక తిరిగి వైజాగ్ వెళ్ళిపోయాడట. అక్కడ మెడికల్ రిప్రజెంట్ గా పనిచేస్తూ .. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ మందులు అమ్మేవాడట.

అలా సంపాదించిన డబ్బు తన స్నేహితుడైన రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ కి పంపేవాడట. సినిమా రైటర్స్ లో ఒకరైన బెజవాడ ప్రసన్న కుమార్, రాంప్రసాద్ మంచి స్నేహితులు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒకే రూంలో ఉండేవారట. ఎంతకీ అవకాశాలు రాకపోవడంతో రాంప్రసాద్ వైజాగ్ వెళ్ళిపోయి పని చేసుకుంటూ ప్రసన్న కుమార్ కోసం డబ్బులు పంపేవాడట. ఒక వైపు ఫ్యామిలీ ని లీడ్ చేస్తూ మరో వైపు స్నేహితుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నెల నెల ఖర్చులకు మనీ పంపించేవాడట.

కాగా బెజవాడకు ఆఫర్లు రాకపోవడంతో నేను కూడా వచ్చేస్తా అని రాంప్రసాద్ తో అన్నాడట. ఆ పని మాత్రం చేయకు కావాలంటే ఇల్లు అమ్మి అయినా డబ్బు పంపిస్తాను. నువ్వు కచ్చితంగా గొప్ప స్థాయిలో ఉంటావు అని భరోసా ఇచ్చాడట. కాగా రైటర్ ప్రసన్న కుమార్, రామ్ ప్రసాద్ బర్త్ డే రోజున అతనికి కాల్ చేసి ఏం కావాలి అని అడిగాడట. ఏమిస్తావ్ అని రాంప్రసాద్ అడగ్గా .. హైదరాబాద్ వచ్చెయ్ మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్లకుండా చేస్తా అని చెప్పాడట. అలా హైదరాబాద్ వచ్చిన రాంప్రసాద్ మళ్ళీ ఈ రోజుకి ఇంటికి వెళ్ళలేదు అంటూ రైటర్ బెజవాడ ప్రసన్న కుమార్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular