Honey Rose: బాలయ్య హీరోయిన్ అలా చేస్తూ అంతలా సంపాదిస్తుందట

హనీరోజ్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి బాలయ్య సరసన నటించబోతుందని తెలుస్తోంది. గతంలోనే ఈ స్టార్ హీరో సరసన మీనాక్షి పాత్రలో అదరగొట్టేసింది. అందుకే ఈ భామకు మరో ఛాన్స్ ఇచ్చినట్టు టాక్.

Written By: Swathi, Updated On : February 14, 2024 6:28 pm

Honey Rose

Follow us on

Honey Rose: ఒక్కసారి సెలబ్రిటీ హోదా వచ్చిందంటే చాలు ఎన్నో విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు. ఇదే విధంగా చాలా మంది హీరోయిన్ లు సంపాదిస్తుంటారు కూడా. అయితే బాలయ్య హీరోయిన్ గుర్తుందా మీకు.. అదేనండి హనీరోజ్. వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజీ ఫిగర్ గా మారిపోయింది. చేతిలో సినిమాలు లేకపోయినా షోరూం, మాల్స్ ఓపెనింగ్స్ అంటూ లక్కీ హాండ్ గా మారిపోయింది. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ ఓ జువెలరీ షోరూం లాంచ్ చేసింది.

అక్కడికి స్లీవ్ లెస్ రెడ్ బ్లౌజ్ తో పాటు ఫ్లోర్ లెంగ్త్ రెడ్ లంగా వేసుకొని మెరుపు తీగలా మెరిసిపోయింది. అక్కడికి వచ్చిన వాళ్ల కళ్లన్నీ హనీరోజ్ అందాలనే ఆకర్షించాయి అనడంలో సందేహం లేదు. మెడలో డైమండ్స్ తో పొదిగిన ఓ హారం వేసుకొని హనీరోజ్ అక్కడికి వచ్చిన వారికి స్టేజ్ పై నుంచి ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ ముద్దుగుమ్మ చూడడానికి తెల్లగా పాలరాతి బొమ్మలా ఉంటుంది. ఆ కలర్ ఫిగర్ రెడ్ కలర్ డ్రెస్ వేయడంతో మరింత అదిరిపోయింది. అందమే అదరహో అనిపించేలా రెడీ అయింది.

హనీరోజ్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి బాలయ్య సరసన నటించబోతుందని తెలుస్తోంది. గతంలోనే ఈ స్టార్ హీరో సరసన మీనాక్షి పాత్రలో అదరగొట్టేసింది. అందుకే ఈ భామకు మరో ఛాన్స్ ఇచ్చినట్టు టాక్. బాలయ్య తన తదుపరి సినిమాలో కూడా హనీరోజ్ కు ఓ కీలక పాత్రలో నటించేలా అవకాశం ఇచ్చారని టాక్. మొత్తం మీద ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు లేకపోయినా కూడా కేవలం ప్రమోషన్స్ తోనే ఫుల్ గా సంపాదించేస్తుందంట ఈ బ్యూటీ.

కేరళలోని తొడుపుజా సైరో-మలబార్ కేథలిక్ కుటుంబంలో 5 సెప్టెంబర్ 1991న జన్మించింది. హనీ రోజ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసింది. ఈమె 2005లో 14వ ఏట యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించింది. ఇక ఆ తర్వాత తెలుగులో కూడా ఇంతకు ముందు రెండు సినిమాలు చేసింది. ముత్యాల సుబ్బయ్య 50వ చిత్రం ఆలయంలో కూడా కనిపించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే పేరుతో వచ్చిన తెలుగు సినిమాలో కూడా కనిపించి మెప్పించింది హనీ రోజ్.