https://oktelugu.com/

Sarika: తండ్రి వదిలేశాడు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. పెళ్లయిన నటుడితో ఎఫైర్‌.. కట్‌ చేస్తే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌!

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇందులో చీకటి వెలుగులు ఉంటాయి. కష్టాలు, సుఖాలు ఉంటాయి. అవి తెలిసి కూడా చాలా మంది ఈ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. కానీ, తర్వాత బాధపడుతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 30, 2024 / 03:50 PM IST

    Sarika

    Follow us on

    Sarika: సినిమారంగం అతిపెద్ద ఇండస్ట్రీ. ఇందులో వేలాది మంది కళామతల్లిని నమ్ముకుని ఈ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అవకాశాలు దక్కిన వారు నటీనటులుగా, రైటర్లు, డైరెక్టర్లుగా రాణిస్తున్నారు. కలిసిరానివారు ప్రయత్నాలు చేసుతన్నారు. కొందరు ఆశలు వదిలేసుని వెళ్లిపోతున్నాడు. ఇండస్ట్రీలో ఎవరి లైఫ్‌ ఎలా టర్న్‌ అవుతుందో ఎవరూ ఊహించలేద. హీరోయిన్‌ల విషయానికి వస్తే అనేక అనుమానాలు ఉంటాయి. రంగుల ప్రపంచంలో రాణించాలని ఇంట్లో వాళ్లను ఎదురించి ఇండస్ట్రీకి వస్తున్నారు. టాలెంట్‌ ఉన్నవారు అవకాశాలను దక్కించుకుంటున్నారు. బలహీన క్షణంలో కష్టాలను తెచ్చుకుంటున్నారు. ఇలా కోటి ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చి తిరుగులేని స్టార్‌గా ఎదిగిన సారిక తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది.

    ఓ వెలుగు వెలిగి..
    సారిక ఇప్పటి తరానికి ఎక్కువగా తెలియదు. కానీ అప్పటి తరానికి ఆమె ఒక డ్రీమ్‌ గాల్‌. ఆమె క్రేజీ మామూలుగా ఉండేది కాదు. ఐదేళ్ల వయసు నుంచే సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. చిన్నతరంలోనే ఇంట్లో గొడవల కారణంగా తండ్రి ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో ఆ కుటుంబానికి సారిక వెన్నెముక అయింది. 1967లో ఇండస్ట్రీలోకి వచ్చిన సారిక ఇప్పటికీ సినిమాల్లో నటిస్తోంది. 1980వ దశకంలో ఆమె ఇండస్ట్రీని ఏలింది. అదే టైంలో అప్పటికే ఇండస్ట్రీలో బిగ్‌ స్టార్‌గా ఉన్న కమల్‌హాసన్‌తో రిలేషన్‌ షిప్‌ కొనసాగించింది.

    పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌..
    కమల్‌కు అప్పటికే వివాహం అయింది. అయినా ఇద్దరూ కొన్నేళ్లు డేటింగ్‌లో ఉన్నారు. దీంతో పెళ్లికి ముదే ప్రెగ్నెంట్‌ అయింది. ప్రస్తుతం హీరోయిన్‌గా ఉన్న శృతిహాస్‌ పెళ్లికి ముందే జన్మించింది. పాప పుట్టిన రెండేళ్ల తర్వాత కమల్‌ తన భార్యకు విడాకులు ఇచ్చి సారికను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వీరికి అక్షర హాసన్‌ పుట్టింది.

    16 ఏళ్లు వైవాహిక జీవితం..
    ఇక కమల్, సారిక 16 ఏళ్లు కలిసి కాపురం చేశారు. 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత కమల్‌ గౌతమిని పెళ్లి చేసుకున్నాడు. సారిక ఒంటరి జీవితం గడుపుతోంది. తమిళంలో సారిక కేవలం రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. అందులో ఒకటి కమల్‌హాసన్‌తో చేసిన టిక్‌.. టిక్‌.. టిక్‌ ఈ ఇనిమా తర్వాతే ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌ మొదలైంది.