Heroine Gajala: చేసింది అతి తక్కువ సినిమాలే అయ్యినప్పటికీ మంచి ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన హీరోయిన్స్ ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒక్కరే గజాల. జగపతి బాబు మరియు లయ కాంబినేషన్ లో వచ్చిన ‘నాలో ఉన్న ప్రేమ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచమైన ఈ అందాల తార, ఆ తర్వాత రాజమౌళి మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1 ‘ సినిమా లో హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, అందులోనూ గజాల కి మంచుకి పేరు ప్రఖ్యాతలు రావడం వల్ల ఆమెకి ఇండస్ట్రీ లో అవకాశాల వెల్లువ కురిసింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తోనే ఆమె ‘అల్లరి రాముడు’ చిత్రం చేసింది. ఆ తర్వాత ‘కలుసుకోవాలని’,’ఓ చిన్నదాన’, ‘తొట్టి గ్యాంగ్’ మరియు ‘భారత సింహా రెడ్డి’ వంటి సినిమాల్లో చేసింది.
కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయం లో ఆమె చేసిన చిన్న పొరపాటు కారణం గా ఆమె సినీ కెరీర్ తలక్రిందులు అయ్యింది. ప్రముఖ హీరో రాజశేఖర్ తో కలిసి ఆమె గతం లో ‘భరత సింహారెడ్డి’ అనే సినిమా చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయం లో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండేది గజాల. అయితే ఒక రాత్రి ఆమె ప్రముఖ హీరో అర్జున్ కి ఫోన్ చేసి, నేను ఆత్మా హత్య చేసుకుంటున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి, స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది.
ఆమె ఫోన్ చేసిన వెంటనే అర్జున్ ఫ్లైట్ ఎక్కి హోటల్ కి వచ్చి వెంటనే ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.సమయానికి హాస్పిటల్ కి తీసుకెళ్లడం వల్ల ఆమె బ్రతికింది. అయితే అప్పట్లో ఈమె అర్జున్ ని చాలా పిచ్చి గా ప్రేమించిందట, ఇదే విషయాన్నీ ఆయనకీ నేరుగా చెప్పగా, నాకు పెళ్ళై చాలా కాలం అయ్యింది, నాకు తెలియకుండా నీలో అలాంటి ఫీలింగ్స్ కలిగించి ఉంటే క్షమించు అని చెప్పాడట, దీనితో గజాల తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసిందని అప్పట్లో టాక్ ఉండేది, ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు.