Nagarjuna Luxury Car: హీరో నాగార్జున కొత్త కారు కొన్నారు. కియా కంపెనీకి చెందిన ఈ కారు మోడల్ ఈవీ 6 అని సమాచారం. నాగార్జున కొన్న ఈ కారు ఫీచర్స్ అదిరిపోయాయి. ఇది ఎలక్ట్రానిక్ మోడల్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 528 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఫుల్ ఛార్జింగ్ కెపాసిటీ 77.4 కిలో వాట్స్. కేవలం నాలుగు నిమిషాలు ఛార్జ్ చేసి వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ అమర్చారు. ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంది. డ్రైవర్ సీటు ఏకంగా పది రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చట. వైట్ కలర్ కియా ఈవీ 6 కారును నాగార్జున, అమల వెళ్లి కొనుగోలు చేశారు. అనంతరం దాని ఎదుట నిలబడి ఫోజిలిచ్చారు.
ఇక ఈ కారు ధర రూ. 60 నుండి 70 లక్షలని సమాచారం. కాగా నాగార్జున తన 62వ చిత్ర ప్రకటన చేశారు. నేడు కేవలం కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. నాగార్జున 62వ చిత్ర పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. అజయ్ భూపతి ఈ చిత్ర దర్శకుడనే ప్రచారం జరుగుతుంది. రేపు దీనిపై పూర్తి క్లారిటీ రానుంది. నాగార్జున రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో కూడా ఓ మూవీ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.
అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ వివిధ కారణాలతో క్యాన్సిల్ అయ్యాయట. దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన నాగార్జున ప్రాజెక్ట్ ఓకే చేశారంటున్నారు. అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు . రెండో మూవీ మహాసముద్రం మాత్రం నిరాశపరిచింది. మహాసముద్రం విడుదలై చాలా కాలం అవుతుంది. అజయ్ భూపతి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
నాగార్జున విజయాలు లేక ఇబ్బందిపడుతున్నారు. క్లీన్ హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోతుంది. సోగ్గాడే చిన్నినాయనా చిత్రం అనంతరం నాగార్జున హిట్ లేదు. మన్మథుడు 2, వైల్డ్ డాగ్, ఘోస్ట్ ఘోర పరాజయం చవిచూశాయి. బంగార్రాజు పర్లేదు అనిపించింది. ఇందులో నాగ చైతన్య ప్రధాన హీరోగా నటించారు. ఒక సాలిడ్ హిట్ కొట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరోవైపు అఖిల్, నాగ చైతన్య కూడా స్ట్రగుల్ అవుతున్నారు. వీరిద్దరి రీసెంట్ చిత్రాలు ఏజెంట్, కస్టడీ డిజాస్టర్ అయ్యాయి.