Manikandan: జై భీమ్.. ఇదొక అద్భుతం అనే చెప్పాలి. అన్ని భాషల్లో కూడా ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో సూర్య మెయిన్ లీడ్ గా నటించినప్పటికీ చిన్నతల్లి పాత్రలో నటించిన ఆ నటికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. పోలీసులు జులం మీద.. మైనారిటీ కులాల మీద వారు చేసే అఘాయిత్యాల గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. వారి కోసం సూర్య చేసిన పోరాటం అదుర్స్ అనే చెప్పాలి. ఇందులో అందరి నటన అద్భుతమే. అయితే రాజకన్ను పాత్రలో నటించిన నటుడు ఎవరో తెలుసా?
జై భీమ్ సినిమాలో చిన్న తల్లి భర్త రాజకన్ను పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు కూడా నటనలో ఒదిగిపోయారు. అయితే ఇందులో ఎక్కువగా తమిళ నటీనటులే ఉన్నారు. కానీ అందరినీ ఆదరించారు ప్రేక్షకులు. ఇక దీనిని తెలుగులో కేవలం డబ్బింగ్ మాత్రమే చేసినా.. సూపర్ హిట్ అయింది. ఈ హిట్ తర్వాత ఇలాంటి సినిమాలు తీయాలంటే తమిళ్ వారికే సొంతం అంటూ కామెంట్లు కూడా వచ్చాయి. ఆ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకుంది జై భీమ్.
చిన్న తల్లి పాత్రలో నటించిన నటి పేరు లిజోమోల్ జోషి. ఆదివాసి దంపతులుగా ఈ సినిమాలో నటించి ఆ తర్వాత తమిళనాడులో ట్రెండ్ క్రియేట్ చేశారు. అయితే రాజకన్ను పాత్రలో నటించిన నటుడు మరెవరో కాదు ఈయన తెలుగులో కూడా అలరిస్తున్నారు. ఈయన మాత్రమే కాదు లిజోమోల్ కూడా ఇతర సినిమాల్లో నటిస్తూ తన నట విశ్వరూపం చూపిస్తుంది. ఈమె ఓరే బామ్మర్థి అనే సినిమాలో నటించగా ప్రస్తుతం ఒక పెద్ద ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది లిజోమోల్.
చిన్న తల్లి భర్త పాత్రలో నటించిన నటుడి పేరు మణికంఠన్.. ఈయన తెలుగులో గుడ్ నైట్ అనే పేరుతో మరోసారి ప్రభంజనం సృష్టించారు. ఈ సినిమా ఓటీటీలో మాత్రమే వచ్చిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. ఈ సినిమా తర్వాత మరొక సినిమాలో కూడా నటించారు. అదే ట్రూ లవర్. ఇది రీసెంట్ గా హిట్ అయినా.. ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. జై భీమ్ సినిమాలో సాధారణ పాత్రలో నటించిన ఈయన ఇప్పుడు మంచి మంచి సినిమాల్లో కూడా నటిస్తూ హీరోగా వస్తుంటే ఆయనను చూసి అందరూ ఆశ్యర్యపోతున్నారు.