Deeksha Sheth: సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కసారైనా అవకాశం చేజిక్కించుకోవాలని తపన పడిపోతూ ఉంటారు. ఒక ఛాన్స్ వస్తే ఆ తర్వాత ఇక తిరిగి ఉండదని అనుకుంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన చాలామంది ఆ తర్వాత స్టార్లుగా మారారు. కానీ అదృష్టం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు సినిమాలోకి వచ్చి చాలా కాలం అయిన ఒక హిట్టు కూడా ఉండదు. మరికొందరు ఒకే సినిమాతో స్టార్ ఐ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. అలా ఓ సినిమాతో స్టార్ అయిన ఓ హీరోయిన్ ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలో నటించింది. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా మాయమైపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..
Also Read: సల్మాన్ టైం బ్యాడ్ .. మళ్ళీ దొరికిపోయిన కండలవీరుడు! మేటర్ ఏంటంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు అంటే చాలామంది లైక్ చేస్తారు. ఆయనతో నటించిన ఏ హీరోయిన్ అయినా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటుంది. బన్నీతో కలిసి వేదం సినిమాలో నటించిన దీక్ష షేథ్ గురించి సినీ ప్రియులకు పరిచయమే. ఈ సినిమా తర్వాత రెబల్, మిరపకాయ్, నిప్పు, వాంటెడ్ వంటి సినిమాల్లో నటించింది. అయితే వీటిలో వేదం, మిరపకాయ సినిమాలు దీక్ష సేతుకు గుర్తింపును తీసుకొచ్చాయి. చివరగా బాలకృష్ణ హీరోగా నటించిన ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా.. అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో కనిపిస్తుందని భావించిన వారికి నిరాశ ఎదురయింది. ఎందుకంటే ఈ సినిమా తర్వాత దీక్ష షేథ్ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయింది.
అయితే తెలుగులో నటించకపోయినా హిందీ కన్నడ సినిమాల్లో నటించింది. కానీ అక్కడ కూడా ఇదే నిరాశ ఎదురవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయితే ఆ తర్వాత దేశాన్ని విడిచి లండన్ వెళ్లిన దీక్షాసేత్ అక్కడ ఐటి కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అప్పటినుంచి ఇప్పటివరకు అక్కడే ఉంటూ ఐటీ జాబ్ చేస్తూ జీవితాన్ని గడుపుతుంది. అయితే చాలామంది సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియా ద్వారా తమ ఫోటోలను అందిస్తూ ఉంటారు. కానీ ఈ భామ మాత్రం ఎప్పుడూ తన ఫోటోలను బయట పెట్టలేదు. రీసెంట్ గా తాను జాబ్ లో ఉండగా కొన్ని ఫోటోలను తీసుకుంది. ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తెలుగు సినిమాల్లో ఉన్నప్పుడు హీరోయిన్ గా ఉన్న దీక్ష సేథ్ ఇప్పుడు ఐటీ ఎంప్లాయి గా మారడంతో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. చాలామంది ఇక్కడ హీరోయిన్గా హీరోగా చేసిన వారు విదేశాల్లో సాధారణ పనులు చేస్తూ కనిపించాలి. వారిలాగే దీక్షా సేటు కూడా సాధారణ ఉద్యోగినిగా కనిపించిందని ఆశ్చర్యపరిచింది. అయితే ఆమె ఐటి జాబ్ చేయడానికి గల కారణాలేంటో పేర్కొనలేదు. కానీ ఫోటోలో మాత్రం తనను చూస్తే చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకప్పటి హీరోయిన్ ఇలా మారిపోయేసరికి అందరూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
Also Read: కన్నప్ప టీజర్ లో ప్లస్ లు, మైనస్ లు ఇవే…అదేంటి విష్ణు అలా ఉన్నాడు..?
View this post on Instagram