Rana Daggubati and Anil Ravipudi : టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్స్ లో ఒకరు అనిల్ రావిపూడి(Anil Ravipudi). రాజమౌళి(SS Rajamouli) తర్వాత నూటికి నూరు శాతం సక్సెస్ రేషియో ఉన్న డైరెక్టర్ ఈయన. ఇప్పటి స్టార్ హీరోలందరూ పాన్ ఇండియన్ మూవీస్ వైపే ఎక్కువ ఆలోచిస్తుండడం వల్ల, అనిల్ రావిపూడి తో సినిమాలు చేయడం లేదు కానీ, లేకపోతే ఆయనతో సినిమాలు తీయడానికి పోటీ పడేవారు. అంతటి మంచి కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. శ్రీను వైట్ల, ఈవీవీ సత్యనారాయణ, జంధ్యాల వంటి టాప్ డైరెక్టర్స్ క్యాటగిరీలోకి అనిల్ రావిపూడి కూడా వస్తాడు. అయితే ఇతన్ని డైరెక్టర్ గా పరిచయం చేసిన క్రెడిట్ కళ్యాణ్ రామ్ కి దక్కుతుంది. ‘ఆగడు’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ రావిపూడి, ఇక మీదట డైరెక్టర్ గా మారాలనే ఉద్దేశ్యంతో తాను కష్టపడి రాసుకున్న పటాస్ స్టోరీ ని చాలా మంది హీరోలకు వినిపించాడు.
ఆ హీరోలలో రానా దగ్గుబాటి(Rana Daggubati) కూడా ఉన్నాడట. బాహుబలి సినిమాకి కమిట్ అయిన కొత్తల్లో ఈ స్టోరీ ని రానా కి వినిపించాడట. అప్పుడు రానా ‘ఈమధ్యనే నేను బాహుబలి సినిమాకి కమిట్ అయ్యాను. అది పూర్తి అయ్యే వరకు ఆగాలి’ అని అన్నాడట. ఓహో..అప్పటి వరకు ఆగాలా సార్?, మన వల్ల కాదులే అని చెప్పి ఇదే స్టోరీ ని కళ్యాణ్ రామ్ కి వినిపించాడు. ఆయన వెంటనే ఓకే చెప్పి, తన సొంత నిర్మాణం లో ఈ సినిమాని మొదలుపెట్టాడు. విడుదలైన తర్వాత ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. రానా దగ్గుబాటి ఆ సినిమాని ఒప్పుకొని చేసి ఉంటే, ఈరోజు మంచి కమర్షియల్ హీరో గా ఎదిగి ఉండేవాడు. అదే లైన్ లో వెళ్లి ఉండుంటే ఈరోజు ఆయన కెరీర్ వేరేలా ఉండేది. బాహుబలి సినిమా కోసం మూడేళ్ళ సమయం కేటాయించాడు.
Also Read : ఆలు లేదు, చూలు లేదు.. అప్పుడే ప్లానింగ్ ఏమిటి అనిల్ ?
సినిమా కోసంగా శరీరాన్ని మార్చుకోవడానికి ఎన్నో డైట్ ప్రికాషన్స్ ని తీసుకున్నాడు. అనేక మందులు వాడాడు, ఆ సినిమా ఉన్నన్ని రోజులు ఇవన్నీ పర్ఫెక్ట్ గా వాడాడు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. కానీ ఎప్పుడైతే ఆయన ఆ సినిమా నుండి బయటకి వచ్చాడో ఆరోగ్యం మొత్తం పూర్తిగా దెబ్బ తినింది. దీంతో సినిమాలు బాగా తగ్గించేసాడు. అడపాదడపా రెండు మూడు సినిమాల్లో కనిపిస్తుంటాడు, అది కూడా క్యారక్టర్ రోల్స్ లో మాత్రమే. దగ్గుబాటి కుటుంబం నుండి మూడవ తరం హీరోకి కనీస స్థాయి మార్కెట్ కూడా క్రియేట్ అవ్వలేదనే బాధ అభిమానుల్లో ఇప్పటికీ ఉంది. దేశవ్యాప్తంగా రానా కి మంచి క్రేజ్ ఉంది, కానీ హీరో గా మార్కెట్ లేదు. సోలో హీరోగా ఎదిగేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేయడం లేదు. బాహుబలి కి ముందు బాగానే ఉండేవాడు, ఆ తర్వాత మొత్తం మారిపోయింది అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి..చిరంజీవి సినిమాకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?