Shivaji: నటుడు శివాజీ పరిశ్రమకు వచ్చి పాతికేళ్ళు దాటిపోయింది. 1997లో చిరంజీవి హీరోగా విడుదలైన మాస్టర్ చిత్రంతో శివాజీ వెండితెరకు పరిచయం అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో సపోర్టింగ్ రోల్స్ చేశాడు. మెల్లగా హీరోగా నిలదొక్కుకున్నాడు. మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అమ్మాయి బాగుంది వంటి చిత్రాలు బ్రేక్ ఇచ్చాయి. సినిమాల్లో రాణిస్తూనే శివాజీ సడన్ గా బ్రేక్ తీసుకున్నాడు. చిత్ర పరిశ్రమకు దూరమయ్యాడు.
అనూహ్యంగా పొలిటికల్ టర్న్ తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ విభజన తనను కలచి వేసిందని పలు సందర్భాల్లో అన్నాడు. మొదట్లో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాడు. అనంతరం టీపీడీకి దగ్గరై కేంద్రంలో ఉన్న బీజీపీ పార్టీని ఉద్దేశిస్తూ పరుష వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర పన్నుతోంది. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అంటూ ఓ అనాలసిస్ చెప్పాడు. శివాజీ గరుడ పురాణం అంటూ ఈ మేటర్ బాగా వైరల్ అయ్యింది.
టీడీపీకి మద్దతుగా ఉన్న శివాజీ మీద ప్రత్యర్ధులు కొన్ని ఆరోపణలు చేశారు. వాటిలో చెల్లి వరసయ్యే అమ్మాయితో శివాజీ ఎఫైర్ పెట్టుకున్నాడు. ఆమెను లేపుకుపోయి వివాహం చేసుకున్నాడట. చిన్నమ్మ ఇంట్లో ఆశ్రయం పొందిన శివాజీ. ఆమె కూతురితో ఎఫైర్ పెట్టుకున్నాడట. అలాగే శివాజీకి రెండ్ పెళ్లిళ్లు జరిగాయట. ఈ ఆరోపణల మీద శివాజీ ఓ సందర్భంలో స్పందించారు.
నేను చెల్లెలు వరసయ్యే అమ్మాయిని వివాహం చేసుకున్నాను అన్నది పూర్తి అవాస్తవం. నా భార్య శ్వేత నాకు బంధువు కాదు. ఆమెను నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. నాది ఆంధ్రా, స్వేతది తెలంగాణ. నేను కట్నం కూడా తీసుకోలేదని శివాజీ అన్నారు. ప్రస్తుతం శివాజీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. టాప్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. అతడు టైటిల్ కొట్టొచ్చనే ప్రచారం జరుగుతుంది.