Tasty Teja: బిగ్ బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. తేజ ఎలిమినెట్ అయినందుకు పెద్దగా ఆశ్చర్యపోలేదు. చాలా నార్మల్ గా బిహేవ్ చేశాడు. కానీ హౌస్ మేట్స్ అసలు ఊహించలేదు. అందరూ చాలా బాధ పడ్డారు. ఇక శోభా శెట్టి అయితే తెగ ఏడ్చింది. నువ్వు లేకుండా ఎలా ఉండాలి తేజ అంటూ ఎమోషనల్ అయింది. కాగా హౌస్ నుంచి బయటకి వచ్చిన తేజ చేసిన కామెంట్లు,ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
హౌస్ లో ఉన్నప్పుడు తేజ అందరితో సరదాగా ఉండేవాడు. శోభా శెట్టి తో బాగా క్లోజ్ గా ఉండేవాడు తేజ. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ హైలైట్ చేశారు బిగ్ బాస్. హోస్ట్ నాగార్జున కూడా వీళ్ళ లవ్ ట్రాక్ పై సెటైర్లు వేసేవాడు.అయితే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తేజ. దీనిపై స్పందించారు. శోభా తో లవ్ ట్రాక్ గురించి ఓ మీడియా ప్రతినిధి అడగ్గా .. క్లారిటీ ఇచ్చాడు. అదేం లేదు,జస్ట్ ఊరికే సరదాగా అలా మాట్లాడుకునే వాళ్లమని చెప్పాడు తేజ.
హౌస్ లో 24 గంటలు కలిసుంటాం కాబట్టి, హౌస్ మేట్స్ అందరితో ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అలా శోభా తో మంచి బాండింగ్ ఏర్పడింది. నేను శోభా మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పారు. శోభా ప్యూర్ హార్టెడ్ పర్సన్, జెన్యూన్ గా ఉంటుంది అందుకే మంచి ఫ్రెండ్స్ అయ్యామని,లవ్వులు గివ్వులు ఏమి లేవని,శోభా నేను మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు. సందీప్ ని నామినేట్ చెయ్యడం పై స్పందిస్తూ .. తాము ఏం మాట్లాడుకొన్నామో,బయట ఏం చెప్పారన్నది చూసి,ఒకటి రెండు రోజుల్లో సందీప్ తో కలిసి ఒక వీడియో రిలీజ్ చేస్తానని చెప్పాడు తేజ.
ఇక ఎలిమినేషన్ స్పందిస్తూ.. తాను తొమ్మిది వారాలు హౌస్ లో ఉంటానని ఊహించలేదు అన్నాడు. మహా అయితే నాలుగు వారాలుంటా అనుకున్న,తొమ్మిది వారాలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు.ఒక వేళ ఎలిమినేట్ అయితే 7,9,12 వారాల్లో అవుతానని నా సెవెంత్ సెన్స్ చెప్పింది అని అన్నారు తేజ. బిగ్ బాస్ లో కి వెళ్లడం గొప్ప అనుభవం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని నేను ఇన్ని వారాలు ఉండటం చాలా హ్యాపీ గా ఉందని చెప్పి,అభిమానులకి,ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు టేస్టీ తేజ.