Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 7 Telugu: కౌశల్.. బిందు మాధవి.. ఇలాంటివారు ఈ సీజన్ లో అన్న...

Bigg Boss 7 Telugu: కౌశల్.. బిందు మాధవి.. ఇలాంటివారు ఈ సీజన్ లో అన్న సాధ్యమా

Bigg Boss 7 Telugu: ఏ భాషలో వచ్చిన.. బిగ్ బాస్ కాన్సెప్ట్ విజయం సాధిస్తూనే వచ్చింది. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ఈ షో తెలుగులో ఇప్పటికే 6 సీజన్లతో పాటు ఒక ఓటిటి సీజన్ తో అల్లరిచింది. మొదటి రెండు సీజన్స్ కి జూనియర్ ఎన్టీఆర్, నాని హొస్టులుగా చేయగా, ఆ తర్వాత ప్రతి సీజన్ కి నాగార్జున హోస్టుగా చేస్తూ వచ్చారు. ఇక కొద్ది రోజుల క్రితమే ఏడవ సీజన్ మొదలైంది.‌

కాగా బిగ్ బాస్ ఇప్పటికి ఎన్ని అభిజిత్ ముగించినా కానీ అందులో క్లిక్ అయింది మాత్రం కేవలం ఒక మూడు సీజన్లు మాత్రమే. కొన్ని అభిజిత్ అయితే అసలు ఎప్పుడు వచ్చాయి అనేది తెలియకుండా వెళ్ళిపోయాయి. ఇక బిగ్ బాస్ టిఆర్పి అనేది తప్పకుండా ఆ ఇంట్లో ఉండే కంటెస్టెంట్స్ పైనే ఆధారపడి ఉంటుంది.

అలా అని మేకర్స్ మొదట్లో హౌస్ మేట్స్ ని తీసుకునేటప్పుడే పాపులర్ సెలబ్రేటిష్ ని తీసుకుంటే సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే బాగా తెలిసిన హీరోలు వచ్చిన బిగ్ బాస్ హౌస్ లోపల సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే చూసేవారు ఎవరు ఉండరు. పెద్ద సెలబ్రిటీస్ కాకపోయినా కొంతమంది మాత్రం హౌస్ లోకి వెళ్ళిన తరువాత బిగ్ బాస్ గేమ్ ని 100% అర్థం చేసుకొని ఆడి ప్రేక్షకులకు చాలా దగ్గరవుతూ ఉంటారు.

ఇలాంటి వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది కౌశల్. ఈయనకు సోషల్ మీడియాలో ఎంతమంది అభిమానించేవారు ఉన్నారో అంత మంది ఇష్టపడని వారు కూడా ఉన్నారు. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి .. తెలుగు బిగ్ బాస్ కి సోషల్ మీడియాలో అత్యంత విజిబిలిటీ తెచ్చింది మాత్రం కౌశల్. పెద్ద పెద్ద హీరోల లాగా ఈయన కోసం సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ లు కూడా వచ్చాయి. కొంతమంది ఇది కౌశల్ ముందుగానే సెట్ చేసుకుని వచ్చారు అని కామెంట్స్ చేశారు.‌ అలా అయితే మొదటి సీజన్లో కూడా చాలామంది అలా చేసే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి ఉండొచ్చు. లేదా కౌశల్ రెండో సీజన్ లో తోటి కంటెస్టెంట్స్ కూడా అలా చేసి ఉండొచ్చు. కాబట్టి కౌశల్ ఇలా ముందుగానే చేసుకోవచ్చారు అనడం 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పట్లో ఆయన కోసమే ఆ బిగ్ బాస్ చూసేవారు ఎంతోమంది. ఆయన ఇష్టపడే వారైనా.. ఆయన్ని అసహ్యించుకునే వారైనా.. కేవలం కౌశల్ వలనే ఆ సీజన్ అంతగా టిఆర్పి తెచ్చుకుంది. అప్పట్లో తనీష్ తనకంటూ ఒక గ్రూప్ చేసుకొని సాధారణమైన బిగ్ బాస్ గేమ్ ఆడుతూ ఉంటే అక్కడ ఒక హీరోగా నిలిచారు కౌశల్. అప్పట్లో ఇంట్లో ఒకరో ఇద్దరో తప్ప ప్రతి ఒక్కరూ కౌశల్ కి యంటీ గానే ఉండేవారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఆయనకు సపోర్ట్ గా ఉంది గెలిపించారు. ముఖ్యంగా బిగ్ బాస్ అనేది స్నేహాలు.. ప్రేమలు.. గేమ్ ఆడేటప్పుడు బలం..సొల్లు కబుర్లు కాదు.. స్ట్రాంగ్ గా మైండ్ తో ఆట ఆడటం అని కౌశల్ విన్నింగ్ రుజువు చేసింది.

ఇక ఆ తరువాత అంతగా చెప్పుకోగలిగేది అభిజిత్ గురించి. కౌశల్ లాగా అభిజిత్ ని అందరూ టార్గెట్ చెయ్యకపోయినా.. అఖిల్ టీం మాత్రం టార్గెట్ చేసింది. ఇక్కడ కూడా ప్రతి సీజన్‌ లో మామూలు కంటెస్టెంట్ల లాగా అఖిల్ స్నేహం, ప్రేమ, ఫిజికల్ ఫిట్నెస్ అంటూ గేమ్స్ ఆడుతూ.. అభిజిత్ ని ఓడిచేద్దాం అనుకున్నారు. కానీ అది జరగలేదు. సోహెల్ తో స్నేహం.. మోనాల్ తో ప్రేమ.. మెహబూబ్ తో కలిసి ఆటలు.. ఇవేవీ అఖిల్ ని అభిజిత్ కన్నా పైన నిలబెట్ట లేకపోయాయి. ఫైనల్ గా అభిజిత్ విన్నర్ గా నిలిచారు.

ఇక వీరిద్దరి తర్వాత బిందు మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.‌ ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో ఉంది అంటే.. తన అందంతోనో..ఎక్స్పోజింగ్ తోనో
. ఎవరితోనో ఒకరితో ప్రేమతోనో.. తన రోజులు కొనసాగిస్తుంది అనే ఉద్దేశాన్ని తెలుగు ప్రేక్షకుల మైండ్ నుంచి తీసేసింది బిందు మాధవి. ఈ సీజన్‌ లో కూడా అఖిల్.. ఆశు రెడ్డితో ప్రేమను కొనసాగిస్తూ.. మిత్ర ..నటరాజ్ మాస్టర్…తేజస్విలను వెనకేసుకొని కప్పు గెలిచేద్దాం అనుకున్నారు. దానికి తోడు విర్రవీగి యాటిట్యూడ్ చూపిస్తూ.. సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఇక రెండోవారం నుంచి ఇంట్లో అందరూ బిందు మాధవి కి యాంటీగా మారడం మొదలుపెట్టారు. కానీ తాను ఎక్కడ తగ్గలేదు.

అనవసరమైన విషయాల జోలికి పోకుండా.. కేవలం ప్రేక్షకుల మైండ్ లో తన స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకునే వైపు మాత్రమే తన ప్రయాణాన్ని కొనసాగించింది. ఒకానొక టైంలో నటరాజ్ మాస్టర్, అఖిల్.. బిందు మాధవిని అవసరానికి మించి మాటలు అన్నా కానీ తాను ఎక్కడ బెదరలేదు. అంతేకాదు తప్పు చేస్తే తన ఫ్రెండ్ అయిన శివాని కూడా నామినేట్ చేసింది. అలా ప్రేక్షకుల గురించి మాత్రమే కాన్సెంట్రేట్ చేసి మొదటి తెలుగు బిగ్ బాస్ ఫిమేల్ విన్నర్ గా నిలిచింది బిందు మాధవి.

ఇక పైన చెప్పిన ముగ్గురు వ్యక్తులు కూడా.. బిగ్ బాస్ గేమ్ ని.. సెంటిమెంట్ లేదా ఫిజికల్ స్ట్రెంత్ లేదా ప్రేమ వ్యవహారాలతో గెలవలేదు. కేవలం తమ స్ట్రాంగ్ మైండ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని గెలిచారు. అందుకే ఆ 3 సీజన్లను చూసిన ప్రేక్షకులు ఆ ముగ్గురి కోసమే చూశారు. ఇక వీరు ముగ్గురు కాకుండా మొదటి సీజన్ శివబాలాజీ కూడా అటని బాగానే ఆడాడు అని చెప్పాలి.

కాగా వీరి మినహా అలాంటివారు మిగతా సీజన్లలో లేకపోవడం వల్ల ఎవరో ఒకరికి బిగ్ బాస్ ట్రోఫీ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా అలాంటి సీజన్లకి పెద్దగా అభిమానులు కూడా లేరు. మరి ఈసారి సీజన్లో కూడా పైన చెప్పిన ముగ్గురు వ్యక్తులు లాగా స్ట్రాంగ్ గా అడి ఎవరన్నా రుజువు చేసుకుంటారా.. లేదా ప్రతి సీజన్ కి విన్నర్ ఉండాలి కాబట్టి ఏదో సింపతి గేమ్ లేదా ప్రేమ వ్యవహారాల వల్ల ఫైనల్ గా.. కప్పు గెలుచుకుంటారా అనేది తెలియాలి అంటే కనీసం ఇంకో రెండు వారాలన్నావే వెచ్చి చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version