Bigg Boss 7 Telugu Voting: ప్రస్తుతం టెలివిజన్ లో అత్యధిక టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అనే చెప్పాలి ఎందుకంటే ఈ షో ని ప్రస్తుతం చాలా మంది చూస్తున్నారు. అయితే బిగ్ బాస్ 7 లో భాగంగా మొన్న జరిగిన ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్ లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయింది.మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ లో ఇప్పటికే ఒకరు ఎలిమినేటి అయ్యారు.అయితే సోమవారం, మంగళవారం వరకు నామినేషన్లు హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే…బిగ్ బాస్ 7 రెండోవారం లో 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు…
ఇక రెండో వారం లో అత్యధిక ఓట్లతో పల్లవి ప్రశాంత్,హీరో శివాజీ, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి,అమరదీప్ చౌదరి,రతికి రోజ్, షకీలా, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ నామినేట్ అయ్యారు.అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వీళ్లలో పల్లవి ప్రశాంత్ ఎక్కువగా అందరి చేత టార్గెట్ చేయబడినట్టు గా తెలుస్తుంది.ఇక స్టార్ మా సీరియల్ బ్యాచ్ గా పిలవబడే అమరదీప్ చౌదరి, ప్రియాంక జైన్, శోభా శెట్టి లు ప్రశాంత్ పైన విరుచుకుపడ్డారు.ప్రశాంత్ ని ఏకం గా తొమ్మిది మంది నామినేట్ చేసారు…
ఇక నామినేషన్ లలో ఉన్న కంటెస్టెంట్ లలో పల్లవి ప్రశాంత్ కె ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి.ఆయనకి అందరికంటే ఎక్కువగా 39.56 శాతం తో ఈయన మొదటి ప్లేస్ లో ఉండగా, ఇక రెండొవ ప్లేస్ లో హీరో శివాజీ ఉన్నారు. ఈయనకి 20.93 శాతం ఓట్లు పడ్డాయి.ఇక అమరదీప్ చౌదరికి 17.94 శాతం ఓట్లు రాగ, రాతికకి 8.18 శాతం గా ఉంది,ఇక గౌతమ్ కృష్ణ కు 3.21 శాతం గా ఉన్నారు ఇక చివరగా షకీలా కి 2.34 శాతం టేస్టీ తేజ కి 2.28 శాతంగా ఓట్లు ఉన్నాయి.ఇక అందరు కలిసి ప్రశాంత్ ని జీరో గా చేద్దాం అని అనుకున్నప్పటికీ ఆయనే టాప్ లో ఉండి వీళ్ళందరికీ షాక్ ఇచ్చాడు.
ఇక ఈ ఓటింగ్ ఇలానే కనక కంటిన్యూ అయితే ఈ ఓటింగ్ లో చివర్లో ఉన్నషకీలా కానీ టేస్టీ తేజ కానీ ఎవరో ఒకరు ఎలిమినేటి కావాల్సి వస్తుంది…ఇక ఇలా బిగ్ బాస్ షో రోజుకి ఒక ట్విస్ట్ తో చాలా ఉత్కంఠ గా సాగుతుంది. గత సీజన్ కంటే కూడా ఈ సీజన్ చాలా వరకు సూపర్ సక్సెస్ సాధించే దిశ దూసుకుపోతుంది…ఇక ఇప్పటికే ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన రావడంతో ఈ షో రోజు రోజు కి టిఆర్పి రేటింగ్ కూడా భారీగానే పెరుగుతుంది…