Bhairava Dweepam: గుర్రాలతో అలా చేసినా వన్యప్రాణి వాళ్లు గుర్తించలేదు.. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్..

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ది బిగ్గెస్ట్ మూవీల్లో ‘బైరవద్వీపం’ ఒకటి. 1994లో చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి వెంకటరామిరెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. కథను రావి కొండల్ రావు అందించగా అప్పట్లో హిట్టు చిత్రాల డైరెక్టర్ గా పేరున్న సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు.

Written By: Chai Muchhata, Updated On : April 26, 2023 4:11 pm
Follow us on

Bhairava Dweepam: ఒక సినిమా తీయడమంటే మాములు విషయం కాదు. అన్ని వర్గాల వారిని మెప్పించాలి. ముఖ్యాంగా సినిమాలో ఎలాటి అసభ్యకర సీన్స్ లేకుండా సెన్సార్ వాళ్లను ఒప్పించాలి. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా డైలాగ్స్ రాయాలి. వీటితో పాటు సినిమాల్లో పక్షులను, జంతువులను ఉపయోగిస్తే వాటికి హాని కలిగించని విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఆ సినిమాలో గుర్రాళ్లను ఉపయోగించారు. ఇవి పడిపోయే విధంగా ముందుగా వైర్లు కట్టారు. ఈ వైర్లతో గుర్రాలు కిందపడిపోతాయి. అయితే ఈ సీన్స్ చూస్తే వన్యప్రాణి వాళ్లు అస్సలు ఒప్పుకోరు. కానీ వారు గుర్తించలేదు. అయితే అంతకుముందు సెన్సార్ క్లియర్ కూడా వచ్చింది. ఇంతకీ ఏ సినిమా అది?

నందమూరి బాలకృష్ణ కెరీర్లో ది బిగ్గెస్ట్ మూవీల్లో ‘బైరవద్వీపం’ ఒకటి. 1994లో చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి వెంకటరామిరెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపుదిద్దుకుంది. కథను రావి కొండల్ రావు అందించగా అప్పట్లో హిట్టు చిత్రాల డైరెక్టర్ గా పేరున్న సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు డైరెక్షన్ చేశారు. కబీర్ లాల్ సినిమాటోగ్రఫీని అందించారు. ఇందులో బాలకృష్ణతో పాటు రోజా, సత్యానారయణ, విజయకుమార్, విజయరంగారాజు, శుభలేక సుధాకర్, గిరిబాబు, బాబుమోహన్ నటించారు. అతిథి పాత్రలో రంభ కనిపిస్తారు.

Bhairava Dweepam

జానపద నేపథ్యంతో వచ్చిన ఈ మూవీలో చాలా వరకు బాలకృష్ణ సాహసం చేసిన సీన్స్ ఎక్కువగా ఉంటాయి. రాణికి ఆభరణం తెచ్చేందుకు విజయ్ పాత్రలో నటించారు బాలకృష్ణ. ఆ ఆభరణం కోసం ఎన్నో ఘట్టాలు దాటాల్సి ఉంటుంది. ఓ సీన్ లో బాలకృష్ణ గుర్రంపై వెళ్తుంటాడు. ఆయన వెనుక మరికొన్ని గుర్రాలు వస్తుంటాయి. ఈ క్రమంలో కింద కొన్ని వైర్లు ముందే కట్టేసి ఉంటాయి. వీటికి తట్టుకొని కొన్నిగుర్రాలు పడే విధంగా సీన్స్ ను తీశారు. అయితే ఈ సీన్ తీసేటప్పుడు గుర్రాలు చాలా వరకు కిందపడ్డాయి. వెంటనే వాటి యజమానులు వచ్చి వాటికి చికిత్స చేయించేవాళ్లు.

అయితే సినిమా పూర్తయిన తరువాత సెన్సార్ బోర్డు వాళ్లు పరీక్షించారు. ఎక్కడా అసభ్య సీన్స్ లేనందును ఒక్క కట్ కూడా పెట్టలేదని తేల్చేశారు. కానీ గుర్రాళ్ల సీన్ మాత్రం వణ్యప్రాణి వాళ్ల కంటో పడితే మాత్రం మేమేం చేయలేమని అన్నారు. కానీ సినిమా రిలీజైన తరువాత వారు ఈ సీన్ ను ఎక్కువగా గుర్తించలేదు. కానీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలకృష్ణ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచింది. ఒకవేళ వన్యప్రాణి చట్టం వాళ్లు గుర్తిస్తే మాత్రం ఆ సమయంలో సినిమా పరిస్థితి ఎలా ఉండేదోనని ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు.