Anasuya Bharadwaj: వరుస చిత్రాలతో అనసూయ ఫుల్ బిజీగా ఉన్నారు ఒకప్పటి ఈ జబర్దస్త్ యాంకర్ క్రేజీ యాక్ట్రెస్ గా మారిపోయారు. ఆమె లేటెస్ట్ మూవీ విమానం. ఈ చిత్ర దర్శకుడు శివ ప్రసాద్. ఆయన వీక్నెస్ లీక్ చేసి షాక్ ఇచ్చింది. ఆఫర్ ఇచ్చిన దర్శకుడికి అన్యాయం చేసింది. అయితే ఇదంతా ప్రమోషన్స్ లో భాగమే. శివ ప్రసాద్ తెరకెక్కిస్తున్న విమానం మూవీ విడుదల కానుంది. ఈ చిత్రాన్ని విన్నూత్నంగా ప్రమోట్ చేస్తున్నారు. విమానం అనేది ఒకప్పుడు గొప్ప ఫాంటసీ. దాన్నో అద్భుతంగా జనాలు చూసేవారు. ఆకాశంలో విమానం సౌండ్ వినిపిస్తే… పిల్లలు ఇళ్లలో నుండి పరుగున వచ్చి చూస్తారు.
విమానం మూవీ కథ ఇలాంటిదే. ఈ గాలిమోటారు చుట్టూ అల్లుకున్న ఎమోషన్స్ దర్శకుడు శివ ప్రసాద్ తెరకెక్కించారు. విచిత్రం ఏమిటంటే… ఆయన కూడా గతంలో విమానం ఎక్కలేదట. ఒంటరిగా ఎవరి అండ లేకుండా విమాన ప్రయాణం చేశారట. ఈ విషయాన్ని అనసూయ ఆసక్తికరంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. మా విమానం దర్శకుడు గురించి మీకొక సీక్రెట్ లీక్ చేస్తానంటూ… ఆయన మొదటి విమానయాన అనుభవానికి సంబంధించిన వీడియో లింక్ షేర్ చేశారు.
ఆ వీడియోలో హైదరాబాద్ నుండి చెన్నై తన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఎలా సాగిందో శివ ప్రసాద్ చెప్పుకొచ్చారు. విమానం చిత్రంలో కీలక రోల్ చేసిన సముద్రఖని చేత తమిళ డబ్బింగ్ పూర్తి చేసుకొని రావాలని శివ ప్రసాద్ కి నిర్మాతలు సూచించారట. చెన్నైకి బస్ లో వెళ్లాలా? లేక ఫ్లైట్ లో వెళ్ళాలా? ట్రైన్ లో వెళ్ళాలా? అని ఆలోచిస్తున్న తరుణంలో మెసేజ్ వచ్చిందట. ప్రొడ్యూసర్స్ ఆయనకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశారట. అసలు నాకు ఏమాత్రం అనుభవం లేదు కదా… ఒక్కడినే ఫ్లైట్ లో ఎలా వెళ్లాలని శివ ప్రసాద్ భలే టెన్షన్ పడ్డాడట.

తన ఫస్ట్ ఫ్లైట్ జర్నీనీ ఎలాంటి సహాయం చేయకుండా పక్కన ఉన్న యూనిట్ సభ్యుడు షూట్ చేశాడట. కాబట్టి మీరు కూడా మీ ఫస్ట్ ఫ్లైట్ అనుభవాన్ని #myfirstvimanam హ్యాష్ ట్యాగ్ తో మాకు పంపండి. మా నుండి వచ్చే సర్పైజ్ కోసం ఎదురు చూడండి అని శివ ప్రసాద్ చెప్పాడు. మూవీ ప్రమోషన్ లో భాగంగా టీమ్ చేసిన ప్రయత్నం బాగుంది. విమానం మూవీలో సముద్రఖని, అనసూయ కీలక రోల్స్ చేశారు.
‘Morning tweeple!!
Maa #Vimanam director #SivaPrasadYanala gari gurinchi oka secret chepthaa gossip secret anukokandi it is a real funny secret
Dont miss. Stay tuned! ⏳
@thondankani #Meerajasmine @eyrahul @DhanrajOffl @zeestudiossouth @KkCreativeWorks @lemonsprasad— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 25, 2023
