Vaishnavi Chaitanya: రీసెంట్ గా విడుదలైనా ‘బేబీ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విడుదలకు ముందే ఆకట్టుకునే పాటలు, అద్భుతమైన టీజర్, ట్రైలర్ కంటెంట్ తో విశేషం గా ఆకర్షించిన ఈ సినిమా విడుదల తర్వాత అంతకు మించి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది. జులై 14 వ తేదీన ప్రారంభమైన ఈ సినిమా వసూళ్ల సునామి జోరు, ఇప్పటికీ కూడా ఏమాత్రం తగ్గలేదు.
వరుసగా 11 రోజులు కోటి రూపాయలకు తక్కువ కాకుండా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం అతి త్వరలోనే వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకోబోతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. పేరుకి ఈ చిత్రం లో ఇద్దరు హీరోలు ఉన్నారనే కానీ, సినిమా మాత్రం వైష్ణవి చైతన్యదే. చిన్న చిన్న క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేసుకుంటూ, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ నేడు ఇంత పెద్ద సక్సెస్ గోల్ కి రీచా వివాదం అంటే సాధారణమైన విషయం కాదు.
అయితే సినిమాల్లోకి రాకముందు వైష్ణవి చైతన్య కూచిపూడి డ్యాన్స్ లో ప్రావీణ్యత సాధించాను అని చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. డ్యాన్స్ పోటీలలో ఆమె స్టేట్ నెంబర్ 1 గా కూడా నిల్చింది. అంతే కాదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి కూడా ఎక్కింది ఈమె. ఇదంతా పక్కన పెడితే యూట్యూబ్ లో ఈ అమ్మాయికి సంబంధించిన చాలా కవర్ సాంగ్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్ కనిపిస్తాయి.
వాటిల్లో ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే షార్ట్ ఫిలిం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సిరీస్ కి ప్రతీ రోజు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ షార్ట్ ఫిలిం కి చాలా సన్నివేశాలకు వైష్ణవి చైతన్య దర్శకత్వం వహించింది అట. అంతే కాదు యూట్యూబ్ లో ఎన్నో కవర్ సాంగ్స్ కి ఆమె కొరియోగ్రఫీ కూడా చేసింది అట. ఈమెలో ఈ టాలెంట్ ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.