Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి అంటే తెలియనివారుండరు. ఆమె సీజన్ 3లో పాల్గొన్నారు. అమెరికాలో ఉంటూ డబ్స్మాష్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంతగా పాపులరైన అషురెడ్డి సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. ఆమెకు టిక్ టాక్ లో కూడా పెద్ద మొత్తంలో ఫాలోవర్స్ ఉండేవారు. సోషల్ మీడియా స్టార్ హోదాలో ఆమెకు బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం వచ్చింది. హౌస్లో అషురెడ్డి పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. స్కిన్ షోనే నమ్ముకున్న ఆమె జర్నీ ఎక్కువ కాలం సాగలేదు. నాలుగైదు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది.

ఒకటి రెండు సినిమాల్లో నటించిన అషురెడ్డి బుల్లితెర టీవీ షోల్లో కనిపిస్తూ ఉంటారు. అదిరింది ఫేమ్ కమెడియన్ హరితో కలిసి చాలా కామెడీ స్కిట్స్ చేశారు ఆమె. స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ లో సైతం అషురెడ్డి స్కిట్స్ చేశారు. ఈ మధ్య బుల్లితెరపై కూడా ఆమె కనిపించడం లేదు. అయితే ఇంస్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నారు. అషురెడ్డి శృతి మించి స్కిన్ షో చేస్తుండగా నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇక రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలతో ఆమెపై విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది. ఛీ డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తావా అంటూ ఆమెను తిట్టుకునే వారి సంఖ్య ఎక్కువైంది. ప్రస్తుతం అషురెడ్డికి జనాల్లో చాలా బ్యాడ్ ఇమేజ్ ఉంది. అయితే ఆమెలోని తెలియని కోణం బయటకు వచ్చింది. అషురెడ్డి కొన్నాళ్లుగా అనాథ పిల్లలను చదివిస్తున్న విషయాన్ని బయటపెట్టారు. క్రిస్మస్ సందర్భంగా తాను ఎడ్యుకేషన్ స్పాన్సర్ చేస్తున్న అనాథలను ఆమె కలిశారు. వారిలో ఇద్దరు స్టూడెంట్స్ ఇంజనీరింగ్, డిగ్రీ కూడా పూర్తి చేశారట.

తన ఆర్థిక సహాయంతో ఉన్నత చదువులు చదివిన ఆ ఇద్దరు అనాథల గురించి చెబుతూ అషురెడ్డి ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. అనాథలకు సహాయం చేయడం గొప్ప విషయంగా ఆమె అభివర్ణించారు. తన పోస్ట్ చూశాక ఎవరికైనా సదరు అనాథ పిల్లలకు సహాయం చేయాలని ఉంటే ఇవిగో వివరాలని… డీటెయిల్స్ పంచుకున్నారు. పైకి పచ్చిగా కనిపించే అషురెడ్డిలో ఇంత దయా గుణం ఉందా? ఆమె కొందరు అనాథ పిల్లలను చదివిస్తున్నారా? అని ఆశ్చర్యపోవడం అందరి వంతయ్యింది. అషురెడ్డిని మొన్నటి దాకా తిట్టుకున్నవారు, ఇప్పుడు పొగిడేస్తున్నారు.
View this post on Instagram