Sreemukhi: పరిణామాలు చూస్తుంటే శ్రీముఖి టాప్ యాంకర్ ప్లేస్ కొట్టేసినట్లు అనిపిస్తుంది. నంబర్ వన్ అండ్ టు గా ఉన్న సుమ, అనసూయ తప్పుకోవడంతో హవా మొత్తం ఆమెదే నడుస్తుంది. దశాబ్దాలుగా సుమ నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. ఎంత మంది యాంకర్స్ వచ్చినా ఆమెకు పోటీ ఇవ్వలేకపోయారు. ఎంతటి వారికైనా వార్ధక్యం తప్పదన్నట్లు… సుమకు కూడా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. దానికి ప్రధాన కారణం యాంకరింగ్ లో వచ్చిన మార్పులు. రష్మీ, అనసూయ వంటి వారు గ్లామర్ యాంగిల్ పరిచయం చేశారు. బుల్లితెర యాంకర్స్ అంటే పద్దతిగా బట్టలు వేసుకోవాలనే రూల్స్ బ్రేక్ చేశారు.

మొదట్లో ఇది విమర్శల పాలైనప్పటికీ ఆడియన్స్ మెల్లగా అలవాటుపడుతూ వచ్చారు. చివరికి యాంకరింగ్ అంటే గ్లామర్ షో అన్న అభిప్రాయానికి మారిపోయారు. మాటలతో మెప్పించడమే యాంకరింగ్ అనే రోజులు పోయి పొట్టి బట్టల్లో అందాల ప్రదర్శన చేయడమే అన్న రోజులు వచ్చాయి. వయసు రీత్యా సుమ ఈ కోణంలో వారికి పోటీ ఇవ్వలేదు. మొదటి నుండి ఆమె ట్రెడిషనల్ యాంకరే. ఆమె తోటి యాంకర్ ఉదయభాను టైట్ జీన్స్, మిడ్డీస్ ట్రై చేశారు. సుమ మాత్రం ఎన్నడూ తన పద్ధతులు వదిలిపెట్టలేదు.

సుమ ఇటీవల విరామం ప్రకటించారు. ఆమె యాంకరింగ్ నుండి తప్పుకున్నారంటే క్రికెట్ నుండి సచిన్ రిటైర్ అయినట్లు ఉంది. అలాగే మరో స్టార్ యాంకర్ అనసూయ సైతం బుల్లితెరను వదిలేశారు. సినిమాల్లో బిజీ కావడంతో టీవీ షోని ఆమె లైట్ తీసుకున్నారు. ఎక్కువ డబ్బులొచ్చే సినిమాలపై పూర్తి దృష్టి పెట్టారు. వీరిద్దరి తర్వాత టాప్ యాంకర్ అంటే రష్మీనే. అయితే ఆమె ఈటీవిని, మల్లెమాలను వదిలి రాదు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంగా శ్రీముఖి జోరు పెరిగింది. ఇటు టెలివిజన్ అటు ఓటీటీలో యాంకర్ గా దున్నేస్తున్నారు. ఆల్రెడీ అరడజను షోలు ఆమె చేతిలో ఉన్నాయి. తాజాగా మొదలవుతున్న బీబీ జోడి షోకి కూడా శ్రీముఖినే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. స్టార్ మా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో డాన్స్ రియాలిటీ షో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షో లాంచింగ్ ఎపిసోడ్ కోసం యాంకర్ శ్రీముఖి ట్రెండీగా తయారయ్యారు. ఆమె హాట్ క్లీవేజ్ షోతో హీటు పుట్టించారు. శ్రీముఖి సూపర్ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.