Rajasulochana: ప్రేమ పెళ్లి విడాకులు ఈ మధ్య కామన్ గా జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహం అయినా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. విడాకులు అనేవి కామన్ గా జరుగుతున్న రోజులు ఇవి. అయితే ఈ రోజుల్లో మాత్రమే కాదు అప్పట్లో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగేవి. ఆ రోజుల్లో హీరోయిన్ గా రాజ సులోచన కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. బోట్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్, నృత్య ప్రదర్శన, నాటక రంగం అంటూ అన్నింటిలోనూ మంచి పేరును సంపాదించింది సులోచన.
స్కూల్లో జరిగిన తప్పిదం వల్ల రాజీవలోచన పేరు కాస్త రాజ సులోచనగా మారింది. ఈమె డాన్స్ కూడా నేర్పించేంది. ఈమె ఇంటికి దగ్గరలో ఉన్న యువతికి నృత్యం నేర్పించేందుకు వాళ్ల ఇంటి దగ్గరకు రోజు వెళ్లేది. అక్కడ కొన్ని దినాలపాటు మిలటరీలో పనిచేసే సమయంలో ఉన్న ప్రగతి స్టూడియోలో స్టోర్ కీపర్ గా ఉన్న పరమశివం అనే వ్యక్తి ఈమెకు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి 1951 సెప్టెంబర్ 11న మద్రాసు నగరంలోని సెయింట్ మెరీస్ హాలులో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.
వివాహం జరిగిన సంవత్సరమే ఒక అబ్బాయి ప పుట్టాడు. ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దీంతో నటనకు వెళ్లింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన సొంత ఊరు అనే సినిమాతో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఇలా సినిమాల్లో బిజీగా ఉంటూనే వైవాహిక జీవితంలో గొడవలతో సతమతమైంది. భర్త పరమశివంతో గొడవలు జరగడంతో ఆయనకు విడాకులు ఇచ్చింది. అదే టైమ్ లో కెరీర్ లో ఆటుపోట్లను కూడా ఎదుర్కొంది. ఆ సమయంలో ఒక తోడు కావాలని భావించి డైరెక్టర్ సి.ఎస్. రావుతో పరిచయం ఏర్పడింది.
ఈయన దర్శకత్వం వహించిన సినిమాల్లో రాజ సులోచన హీరోయిన్ గా నటించేంది. వీరిద్దరి చనువు చూసి ఎన్నో పుకార్లు వచ్చాయి. అయితే వీరిద్దరి 1963 లో పెళ్లి చేసుకుంటే.. 1966ల జులై 27న ఇద్దరు కవలలు పుట్టారు. అయితే ఎంతో సంతోషంగా ఉన్న వీరి జీవితంలో సడన్ గా సఖ్యత లోపించింది. అలా అభిప్రాయ బేధాల వల్ల వీరు కూడా విడిపోయారు. చివరకు అనారోగ్య పాలై మార్చి 5 2013న తుది శ్వాస విడించింది రాజ సులోచన.