Homeఎంటర్టైన్మెంట్Pasupuleti Kannamba: చెన్నై రోడ్ల మీద పిచ్చిదానిలా పరుగెత్తిన కన్నాంబ, చనిపోతుందేమో అని...

Pasupuleti Kannamba: చెన్నై రోడ్ల మీద పిచ్చిదానిలా పరుగెత్తిన కన్నాంబ, చనిపోతుందేమో అని పట్టుకున్న జనాలు.. అసలు ఏం జరిగిందంటే?

Pasupuleti Kannamba: నటి కన్నాంబ మద్రాసులో రోడ్ల మీద పరుగెత్తారట. పిచ్చిదానిలా ఉన్న ఆమెను కొందరు పట్టుకుని పక్కన కూర్చోబెట్టారట. వేగంగా వెళుతున్న వాహనాలు ఆమెను ఎక్కడ గుద్దుతాయో అని అనుకున్నారట. అసలు కన్నాంబకు అలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? ఇంట్రెస్టింగ్ స్టోరీ..

Also Read: ‘నా భర్త అలాంటి వాడు’ అంటూ సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ మొదటితరం స్టార్ హీరోయిన్ కన్నాంబ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రిల కంటే ముందే ఆమె పరిశ్రమకు వచ్చారు. స్టార్ హోదా తెచ్చుకున్నారు. 1934లో విడుదలైన సీతాకళ్యాణం మూవీతో పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ రోజుల్లో మహిళలు సినిమా వంటి రంగాలకు రావడం, సక్సెస్ కావడం గొప్ప విషయం. అప్పటి సమాజంలో మహిళలకు ఉండే ఆంక్షలను ఎదిరించి కన్నాంబ హీరోయిన్ అయ్యారు. కన్నాంబ కెరీర్లో 170కి పైగా చిత్రాల్లో నటించారు.

1938లో విడుదలైన గృహలక్ష్మీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో విచిత్ర ఘటన చోటు చేసుకుందట. హెచ్ ఎం రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన గృహలక్ష్మీ చిత్రంలో నాగయ్య ప్రధాన పాత్ర చేశాడు. ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశంలో కన్నాంబ పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ రోడ్డు మీద పరుగెత్తాలి. జనాలకు తెలియకుండా సహజంగా తీయడం కోసం కెమెరాను ఒక మూలన పెట్టి షూట్ చేస్తున్నారట. కన్నాంబ చెన్నై రోడ్ల మీద పరుగెడుతుందట.

కన్నాంబను ఎవరూ గుర్తుపట్టలేదట. ఎవరో మహిళ మతిస్థిమితం లేక రోడ్ల మీద తిరుగుతుంది. ఏదైనా వాహనం కింద పడితే ప్రమాదం అని భావించిన జనాలు, కన్నాంబను పెట్టుకున్నారట. ఆమెను రోడ్డు పక్కన కూర్చోబెట్టారట. తర్వాత ఇది ఒక సినిమా షూటింగ్ అని చెప్పడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారట. ఈమె కన్నాంబనా అనుకున్నారట. ఆ రోజుల్లో సినిమా అనేది పెద్ద వింత. నటులను ఆకాశం నుండి దిగొచ్చిన దేవతల్లా జనాలు భావించేవారు. వారు చాలా ప్రత్యేకం అనుకునేవారు.

అందుకే అవుట్ డోర్ షూటింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది. జనాలు షూటింగ్స్ చూసేందుకు ఎగబడిపోయేవారు. ఈ రోజుల్లో కేవలం స్టార్ హీరోల విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. ఓ మోస్తరు నటులు ఎదురుగా వచ్చినా జనాలు పట్టించుకోరు. కన్నాంబ దర్శకుడు, నిర్మాత అయిన కడారు నాగభూషణం ని వివాహం చేసుకుంది. 1964లో కన్నాంబ అకాల మరణం పొందారు. 1965లో విడుదలైన కీలుబొమ్మలు ఆమె చివరి చిత్రం.

 

Also Read: మహేష్ ఎఫైర్ నడిపిన ఏకైక హీరోయిన్, ముంబైలో భార్య నమ్రతకు అడ్డంగా బుక్… డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

RELATED ARTICLES

Most Popular