https://oktelugu.com/

Akkineni Nagarjuna: టికెట్ ప్రైస్ ప్రాబ్లమ్ మా సినిమాకు ఉండదు అంటున్న కింగ్ నాగార్జున… కారణం అదేనా ?

Akkineni Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నూత‌న సంవ‌త్స‌రం రోజున బంగార్రాజు టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. నాగార్జున పంచెక‌ట్టులో నాగ‌చైత‌న్య స్టైలీష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వ‌హిస్తున్న‌ ఈ మూవీ అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందుతుంది. ఇప్పుడు తాజాగా ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 5, 2022 / 08:15 PM IST
    Follow us on

    Akkineni Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నూత‌న సంవ‌త్స‌రం రోజున బంగార్రాజు టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. నాగార్జున పంచెక‌ట్టులో నాగ‌చైత‌న్య స్టైలీష్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వ‌హిస్తున్న‌ ఈ మూవీ అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందుతుంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాను సంక్రాంతి రేసులో దించుతున్నారు. జనవరి 14న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.

    ఈ క్రమంలో ప్రెస్ మీట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ… సినిమాను మొదటి నుంచి పండగ సినిమా పండగ లాంటి సినిమా అంటూ చెప్పుకుంటూ వస్తున్నాం కుదిరింది కాబట్టి ఈ సంక్రాంతి వస్తున్నాం లేకుంటే నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ చేసి షూటింగ్ మొదలుపెట్టేవాళ్ళం అని అన్నారు. అలానే టికెట్ రేట్ ఇష్యూ గురించి స్పందించమని నాగ్ ని కోరగా.. ‘సినిమా స్టేజ్ మీద పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదు… నేను మాట్లాడను’ అని తేల్చి చెప్పారు నాగార్జున.

    ఏపీలో మీ సినిమాపై కమర్షియల్ గా ఎఫెక్ట్ పడుతుందేమోనని ప్రశ్నించగా.. ‘నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. టికెట్ రేట్స్ పెరిగితే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే..’ అని బదులిచ్చారు నాగ్. అనంతరం కలెక్షన్స్ గురించి, హయ్యెస్ట్ గ్రాసర్ గురించి టాపిక్ రాగా.. నెంబర్స్ గేమ్ నుంచి ఎప్పుడో వెళ్లిపోయానని చెప్పారు నాగార్జున. నెంబర్స్ అనేవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయని చెప్పారు. అయితే, టికెట్ల ధరలపై నాగ్ చేసిన వ్యాఖ్యలు నిర్మాతలకు కాస్త ఇబ్బందికరమే అనిపిస్తోంది.