https://oktelugu.com/

Bigg Boss: బిగ్ బాస్ లో ఆనీ మాస్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ టీఆర్పీ పరంగా టాప్ లో దూసుకుపోతుంది. కాగా బిగ్ బాస్ ఫైన‌ల్ ద‌గ్గ‌రికి వ‌స్తున్న క్ర‌మంలో ఎవ‌రికి వారు తమ శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెరపై విజ‌యవంతంగా  ప‌ద‌కొండు వారాలు పూర్తి చేసుకుంది ఈ షో. కాగా ఈ వారం కొరియో గ్రాఫ‌ర్ ఆనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ట్రోఫీ తోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 02:19 PM IST
    Follow us on

    Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ టీఆర్పీ పరంగా టాప్ లో దూసుకుపోతుంది. కాగా బిగ్ బాస్ ఫైన‌ల్ ద‌గ్గ‌రికి వ‌స్తున్న క్ర‌మంలో ఎవ‌రికి వారు తమ శైలిలో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బుల్లితెరపై విజ‌యవంతంగా  ప‌ద‌కొండు వారాలు పూర్తి చేసుకుంది ఈ షో. కాగా ఈ వారం కొరియో గ్రాఫ‌ర్ ఆనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ట్రోఫీ తోనే తిరిగి ఇంటికి వెళ్లాలనుకున్న ఆనీ మాస్టర్‌… మధ్యంలోనే వెనుదిరగక తప్పలేదు. వారాలు గడుస్తున్న కొద్ది ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరుగుతుంది. మిగతా కంటెస్టెంట్ లతో పోలిస్తే ఆనీ ఫిజికల్ టాస్క్ లలో, గ్రూప్ క్గ గేమ్ ఆడుతూ ఉండడంతో ఎలిమినేట్ అయినట్లీ తెలుస్తుంది.

    కాగా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న‌ రోజులు తనదిన శైలిలో అందర్నీ ఎంట‌ర్టైన్ చేసింది ఆనీ మాస్టర్. విజ‌యవంతంగా 77 రోజులు ఇంట్లో ఉండి ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఇప్పుడు ఆనీ మాస్ట‌ర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే చర్చ ఆసక్తి క‌రంగా మారింది. పదకొండు వారాల పాటు హౌస్ లో ఉన్న ఆమె ఎంత పారితోషకం పుచ్చుకుందనే ప్రశ్న సోషల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రెమ్యూనరేషన్ అన్నది సెలబ్రిటీ పాపులారిటీని బట్టి నిర్ణయిస్తారు. అలా ఒక్కొక్కరికి ఒక్కోలా పారితోష‌కం అందిస్తారు.

    అలా ఆనీ మాస్టర్ కు వారానికి 3,50,000 ల అందించార‌ట‌. పదకొండు వారాల‌కు గాను మొత్తం 38,50,000 ల వ‌ర‌కు సంపాదించిందని సోష‌ల్ మీడియా టాక్. అని మాస్టర్ కి ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉంది. ఇప్ప‌టికే అనేక డ్యాన్స్ షో లకు జడ్జీగా వ్య‌వ‌హ‌రించింది. కాబట్టి బిగ్ బాస్ యాజమాన్యం ఇంత పెద్ద మొత్తం ముట్టజెప్పిందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.