Rashi Khanna: ఢీల్లి బ్యూటీ రాశి ఖన్నా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా దున్నేస్తున్న ఈ భామ, లెక్కకు మించిన ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా తమిళంలో అరడజను చిత్రాల వరకు చేస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తర్వాత టాలీవుడ్ లో చిన్న గ్యాప్ రాగా, మరలా బిజీ అయ్యింది. తెలుగులో ప్రస్తుతం ఆమె రెండు చిత్రాలు చేస్తున్నారు. నాగ చైతన్యకు జంటగా థాంక్యూ, గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ చిత్రాలలో నటిస్తున్నారు.

2019లో రాశి వరుస హిట్స్ అందుకుంది. వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్ర విజయాలతో స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చి చేరింది. అయితే అనూహ్యంగా ఆమెను వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ కోలుకోలేని దెబ్బ వేసింది. విజయ్ దేవరకొండతో శృతిమించిన సన్నివేశాలలో తెగించి నటిస్తే, ఫలితం మాత్రం ఉసూరుమనిపించింది. వరల్డ్ ఫేమస్ లవర్ పరాజయం వలన రాశికి ఒక్కసారిగా టాలీవుడ్ లో ఆఫర్స్ పడిపోయాయి. ఆమె బోల్డ్ రోల్ చేయడం కూడా ఇందుకు కారణం . అయితే మరలా పుంజుకుని టాలీవుడ్ లో పాగా వేసే పనిలో ఉన్నారు.
ఎంటర్టైనింగ్ చిత్రాల దర్శకుడిగా పేరున్న మారుతీ పక్కా హిట్ చిత్రాలు తీస్తారనే బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు విక్రమ్ కుమార్ ‘మనం’ వంటి చిత్రంతో చేసిన మ్యాజిక్ ఎవరూ మరిచిపోలేదు. ఈ ఇద్దరు దర్శకులతో రాశి చేస్తున్న సినిమాలు విజయం సాధించే అవకాశాలే ఎక్కువ. ఒక్క హిట్ ఆమెకు దొరికితే మరలా టాలీవుడ్ లో ఆఫర్స్ పట్టేయవచ్చు.
మరోవైపు సోషల్ మీడియాలో రాశి ఖన్నా రచ్చ మాములుగా లేదు. ఆమె తన ఫ్యాన్స్ కోసం తరచుగా ఫోటో షూట్స్ చేస్తారు. తాజాగా రెడ్ ట్రెండీ వేర్ లో నాభి, నడుము అందాలు చూపిస్తూ చిలిపి చూపులతో బాణం వేసింది. రాశి ఖన్నా అందాలు చూసిన ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. ఇక గోవా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై రాశి తన డాన్స్ తో అతిధులను అలరించారు.