https://oktelugu.com/

ఇంట్రెస్టింగ్.. బాలయ్య హీరోయిన్లు మరీ ఇంత చీపుగానా?

నందమూరి నటసింహ బాలకృష్ణ తాజా చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సింహా’.. ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ బోయపాటి-బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా తాజాగా హైదరాబాద్లో రీ స్టాట్ అయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ మూవీలో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 02:31 PM IST
    Follow us on

    నందమూరి నటసింహ బాలకృష్ణ తాజా చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సింహా’.. ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    బోయపాటి-బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా తాజాగా హైదరాబాద్లో రీ స్టాట్ అయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ షూటింగ్ ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఈ మూవీలో బాలయ్య ద్విపాత్రభియనం చేస్తున్నాడు. దీంతో బాలయ్య పక్కన ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండటంతో చిత్రబృందం హీరోయిన్లను వెతికే పనిలో పడింది.

    Also Read: త్రివిక్రమ్‌పై మిడ్‌ రేంజ్‌ హీరోల కన్ను

    60కోట్ల బడ్జెట్లో బాలయ్య-బోయపాటి సినిమాను తెరకెక్కనుందట. దీనిలో బాలయ్య.. బోయపాటిలకే దాదాపు 25కోట్లు పోతుంది. మిగతా బడ్జెట్లో సినిమాను తెరకెక్కించాలంటే దర్శకుడికి కత్తిమీద సాములా మారింది. దీంతో దర్శకుడు స్టార్ హీరోయిన్లు.. నటీనటుల జోలికి వెళ్లకుండా తక్కువ రేటులో వచ్చే వారితోనే సినిమాను కానిచ్చేస్తున్నాడని తెలుస్తోంది.

    బాలయ్యకు జోడి నటించే హీరోయిన్ల విషయంలోనూ బోయపాటి ఇలానే చేయడం చర్చనీయాంశంగా మారింది. బాలయ్య సినిమాలో స్టార్ హీరోయిన్లకు కాకుండా తక్కువ పారితోషికం తీసుకునే వారికి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలయ్యకు జోడీగా ప్రయాగ మార్టిన్ అనే కొత్త అమ్మాయికి ఛాన్స్ ఇవ్వగా ఆమెకు కేవలం 20లక్షలు ఇవ్వనున్నారట. ఇక మరో హీరోయిన్ గా పూర్ణను తీసుకోగా ఆమెకు కేవలం 12లక్షలు ఇవ్వనున్నారని సమాచారం.

    Also Read: కాపీ’ కథతో వస్తున్న నాని ‘శ్యామ్ సింగరాయ్’..!

    బాలయ్య సినిమాలో స్టార్ హీరోయిన్లను పెడితే ఒక్కో హీరోయిన్ కు కోటిపైనే చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ రేటులో హీరోయిన్లను తీసుకోవడం ద్వారా బడ్జెట్ మిగిల్చి ఆ డబ్బులను సినిమా మేకింగ్ పై ఖర్చు చేయాలని భావిస్తున్నాడు. హీరోయిన్లతోపాటు నటీనటుల విషయంలోనూ బోయపాటి ఇలానే చేస్తున్నాడట. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరుత్సాహం చెందుతున్నారు. బాలయ్య పక్కన ఇంత చీపుగా హీరోయిన్లను పెట్టడం ఏంటనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.