https://oktelugu.com/

చైతు ‘లవ్ స్టోరీ’ పై నాగ్ నిర్ణయం !

సినిమా హిట్ అవ్వాలంటే.. ఎక్కడా బోరింగ్ అనిపించకూడదు. స్క్రీన్ ప్లే వెరీ ఇంట్రస్టింగ్ గా సాగాలి. మధ్యలో కొన్ని సీన్స్ బాగలేకపోయినా సినిమా బోర్ కొట్టేస్తోంది. అయితే ఒక సినిమాలో బోరింగ్ కి కేరాఫ్ అడ్రస్ అనవసరమైన లెంగ్త్ సీన్లే అని చెప్పాలి. అందుకే సినిమా వాళ్ళు… ఎక్కువగా కొత్త సినిమాల విషయంలో సినిమా నిడివి ఎంత అని అడుగుతుంటారు. నిడివిని బట్టి సినిమా భవిష్యత్తును చెప్పొచ్చు అనేది వారి అభిప్రాయం కావొచ్చు. ఏది ఏమైనా సినిమాలో […]

Written By: , Updated On : November 6, 2020 / 02:32 PM IST
Follow us on

Love Story Movie
సినిమా హిట్ అవ్వాలంటే.. ఎక్కడా బోరింగ్ అనిపించకూడదు. స్క్రీన్ ప్లే వెరీ ఇంట్రస్టింగ్ గా సాగాలి. మధ్యలో కొన్ని సీన్స్ బాగలేకపోయినా సినిమా బోర్ కొట్టేస్తోంది. అయితే ఒక సినిమాలో బోరింగ్ కి కేరాఫ్ అడ్రస్ అనవసరమైన లెంగ్త్ సీన్లే అని చెప్పాలి. అందుకే సినిమా వాళ్ళు… ఎక్కువగా కొత్త సినిమాల విషయంలో సినిమా నిడివి ఎంత అని అడుగుతుంటారు. నిడివిని బట్టి సినిమా భవిష్యత్తును చెప్పొచ్చు అనేది వారి అభిప్రాయం కావొచ్చు. ఏది ఏమైనా సినిమాలో సోది ఎక్కువైతేనే లెంగ్త్ ఎక్కువ వస్తోందనేది సాధారణ ప్రేక్షకుడికి కూడా తెలుసు. అందుకే అలాంటి సినిమాని ఏ స్టార్ డైరెక్టర్ కూడా కాపాడలేడు. పవన్ అజ్ఞాతవాసికి జరిగింది అదే.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

మొత్తానికి సినిమా లెంగ్త్ కి అంత ప్రాధాన్యత ఉందని.. ఈ మధ్య మేకర్స్ బాగా గుర్తించారు. ఆయితే చైతు ‘లవ్ స్టోరీ’ మరీ లెంగ్త్ ఎక్కువ వచ్చిందని.. ఈ సినిమా గాని ప్లాప్ అయితే ఇక చైతు సక్సెస్ రేటు పడిపోతుందని.. అప్పుడు చైతు మార్కెట్ కూడా పడిపోయే ఛాన్స్ ఉందని నాగ్ ఫీల్ అవుతున్నాడట. ఏమైనా వరుస హిట్స్ లో ఉన్న చైతు ఈ లవ్ స్టోరీతో సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లిపోతాడని విపరీతమైన హైప్ ఉంది. అందుకే శేఖర్ కమ్ముల చేస్తోన్న ఈ సినిమా ఎలా వచ్చిందో అని ‘లవ్ స్టోరీ’ ఔట్ పుట్ తెప్పించుకుని, రఫ్ ఎడిటింగ్ అయిన సినిమా మొత్తాన్ని నాగార్జున ఇప్పటికే ఆల్ రెడీ చూశాడని తెలుస్తోంది.

Also Read: త్రివిక్రమ్‌పై మిడ్‌ రేంజ్‌ హీరోల కన్ను

కాగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ప్రీ క్లైమాక్స్ విషయంలో కొన్ని మార్పులు చేయమని కూడా నాగ్, శేఖర్ కమ్ములకు చెప్పాడట. ఆ మార్పులు ప్రధాన అంశం సినిమా లెంగ్త్ తగ్గించమనేనట. అయినా శేఖర్ కమ్ముల మాత్రం ఆ సీన్స్ ను అలాగే ఉంచాడని.. సినిమాలో అవి బాగా పేలతాయని శేఖర్ బాగా నమ్మకంగా ఉన్నాడని సమాచారం. కానీ ఆ సీన్స్ అసలు బాగాలేదని నాగ్ నిర్ణయమట. మొత్తానికి ఈ నమ్మకం నిర్ణయం మధ్యన ఆ సీన్స్ ఉంచాలో తీయలో నిర్మాతలకు హీరోకు అర్ధం కాని పరిస్థితి అట. మరి లవ్ స్టోరీలో నాగ్ నిర్ణయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.