https://oktelugu.com/

Bheemla Nayak: పవన్ సరే.. రానా ఏడి?

మలయాళంలో గ్రాండ్ హిట్ అయిన మూవీ ‘అయ్యప్పమ్ కోషియమ్’. కరోనా లాక్ డౌన్ వేళ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్అయ్యింది. తెలుగులో దీన్ని పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలను పెట్టి తాజాగా రిమేక్ చేశారు. నిజానికి మలయాళంలో హిట్అయిన ఈ చిత్రం మల్టీస్టారర్ మూవీ. అందులో బిజు మీనన్, ఫృథ్వీరాజ్ లాంటి స్టార్ హీరోలు ఇద్దరూ పోటీపోటీగా నటించారు. ఏ పాత్రకు ఆ పాత్ర పవర్ ఫుల్. బిజుమీనన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండగా.. ఫృథ్వీ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 15, 2021 / 05:05 PM IST
    Follow us on

    మలయాళంలో గ్రాండ్ హిట్ అయిన మూవీ ‘అయ్యప్పమ్ కోషియమ్’. కరోనా లాక్ డౌన్ వేళ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్అయ్యింది. తెలుగులో దీన్ని పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలను పెట్టి తాజాగా రిమేక్ చేశారు.

    నిజానికి మలయాళంలో హిట్అయిన ఈ చిత్రం మల్టీస్టారర్ మూవీ. అందులో బిజు మీనన్, ఫృథ్వీరాజ్ లాంటి స్టార్ హీరోలు ఇద్దరూ పోటీపోటీగా నటించారు. ఏ పాత్రకు ఆ పాత్ర పవర్ ఫుల్. బిజుమీనన్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండగా.. ఫృథ్వీ రాజ్ పాత్ర హీరోను ఢీకొట్టేలా తీర్చిదిద్దారు. ఇద్దిరికీ సరిసమాన గుర్తింపును సినిమాలో పోస్టర్లలో ఇచ్చారు.

    తెలుగులోకి ఇది రిమేక్ గా వచ్చేసరికి ట్రైన్ రివర్స్ అయ్యింది. ఈ మల్టీ స్టారర్ కాస్తా సోలో పవన్ కళ్యాణ్ హీరోగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా ఫస్ట్ లుక్ లు, ప్రోమోల్లో కేవలం పవన్ కళ్యాణ్ నే చూపిస్తున్నారు. ఈరోజు విడుదలైన ‘బీమ్లా నాయక్ ’ గ్లింప్స్ లోనూ అదే కథ. పవర్ స్టార్ లుంగీలో విలన్లను కొట్టించింది చూపించారు. విలన్ ఇంటికి వచ్చిన పవన్ ను వీరావేశంలో చూపించి ఆ విలన్ అయిన రానాను ఏమాత్రం చూపించకపోవడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

    ఇక మలయాళంలో ఇద్దరు హీరోల పేర్లు కలిసేలా ‘అయ్యప్పమ్ కోషియం’ అని పెట్టగా.. తెలుగులో కేవలం పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ‘బీమ్లా నాయక్’ అని మాత్రమే పెట్టేసే సోలో హీరో సినిమాగా చూపించారు.

    రానా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారసు. అతడికి సంబంధించిన ఒక్క సీన్ అయినా తాజా టీజర్ లో పెట్టి ఉంటే మరింతగా టీజర్ రక్తికట్టేది. మేకర్స్ కు పవన్ పై ఉన్న శ్రద్ధ రానాపై లేదని తెలుస్తోంది. కొంపదీసి మాతృక కథను పవన్ మేనియాతో రుద్దేశారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.అ దే జరిగితే మలయాళంలో హిట్ అయిన ఈ మూవీ తెలుగులో తేడా కొట్టడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.