Khushi Re Release Closing Collections: ఈమధ్య కాలం లో మన స్టార్ హీరో లో సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో రీ రిలీజ్ అయ్యాయి..కానీ వాటిలో జల్సా మరియు పోకిరి సినిమాలు మాత్రమే ప్రభంజనం సృష్టించాయి..అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఖుషి చిత్రం డిసెంబర్ 31 వ తారీఖున రీ రిలీజ్ అయ్యి వసూళ్ల పరంగా భవిష్యత్తులో కూడా ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టింది.

మొదటిరోజు ఏకంగా నాలుగు కోట్ల 20 లక్షల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం రెండవ రోజు కోటి 60 లక్షల రూపాయిలు వసూలు చేసి చరిత్ర సృష్టించింది..ఆ తర్వాత కూడా వీక్ డేస్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా మొదటి వారం లో 7 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఇది ఆల్ టైం సెన్సేషనల్ ఇండియన్ రికార్డు.
రెండవ వీకెండ్ లో కూడా ఈ సినిమా చాలా ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని రిజిస్టర్ చేసింది..కొత్త సినిమాలకే రన్ లేని ఈరోజుల్లో 22 ఏళ్ళ క్రితం విడుదలైన ఒక సినిమా ఈ రేంజ్ ప్రభంజనం సృస్టించిండం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..లాంగ్ రన్ ఇంకా వచ్చే ఛాన్స్ కూడా ఉంది..కానీ సంక్రాంతి సినిమాలు సిద్ధం గా ఉన్నాయి కాబట్టి ఖుషి చిత్రాన్ని థియేటర్స్ నుండి తీసివెయ్యాల్సి వస్తుంది.

క్లోసింగ్ కలెక్షన్స్ ఒకసారి ప్రాంతాల వారీగా పరిశీలిస్తే ఈ చిత్రానికి నైజం ప్రాంతం లో మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, సీడెడ్ లో 90 లక్షల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇక కర్ణాటక ప్రాంతం లో ఈ సినిమా ఒక విస్ఫోటనం ని సృష్టించింది..సుమారు 42 లక్షల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా అక్కడి నుండి రాబట్టింది..ఓవర్సీస్ లో లో కూడా సుమారు 40 లక్షలు రాబట్టగా మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 8 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.