https://oktelugu.com/

Sudigali Sudheer- Indraja: సుధీర్, ఇంద్రజకు ఉన్న రిలేషన్ ఇదేనట..: ఓపెన్ అయిన జబర్దస్త్ జడ్జి

Sudigali Sudheer- Indraja: బుల్లితెరపై కామెడీని పంచే జబర్దస్త్ షో ఎన్నో జీవితాలను నిలబెట్టింది. ఒకప్పుడు ఇందులో కామెడీ స్కిట్లు చేసిన వారు ఇప్పుడు సినిమాల్లోనూ.. ఇతర టీవీ చానెళ్లో మంచి పొజిషన్లో ఉన్నారు. జబర్దస్త్ లో ప్రముఖంగా ఉన్న కొందరు షో నుంచి వెళ్లిపోవడంతో ఉన్నవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఇటు జబర్దస్త్, అటు శ్రీదేవి డ్రామా కంపెనీనీ వీడడం ఆయన ఫ్యాన్స్ కు బాధను కలిగించింది. అయితే సుడిగాలి సుధీర్ ఈ షోల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 30, 2022 / 09:29 AM IST
    Follow us on

    Sudigali Sudheer- Indraja: బుల్లితెరపై కామెడీని పంచే జబర్దస్త్ షో ఎన్నో జీవితాలను నిలబెట్టింది. ఒకప్పుడు ఇందులో కామెడీ స్కిట్లు చేసిన వారు ఇప్పుడు సినిమాల్లోనూ.. ఇతర టీవీ చానెళ్లో మంచి పొజిషన్లో ఉన్నారు. జబర్దస్త్ లో ప్రముఖంగా ఉన్న కొందరు షో నుంచి వెళ్లిపోవడంతో ఉన్నవాళ్లు తట్టుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ ఇటు జబర్దస్త్, అటు శ్రీదేవి డ్రామా కంపెనీనీ వీడడం ఆయన ఫ్యాన్స్ కు బాధను కలిగించింది.

    Sudigali Sudheer- Indraja

    అయితే సుడిగాలి సుధీర్ ఈ షోల్లో లేకున్నా.. ఆయన గురించి పదే పదే ప్రస్తావన వస్తోంది. కొన్ని రోజుల కిందట సుడిగాలి సుధీర్ గురించి ఆటో ప్రసాద్ మాట్లాడారు. తన స్నేహితుడు గుర్తొస్తున్నాడని సుధీర్ గురించి ఎమోషనల్ అయ్యారు. ఇదే సమయంలో జడ్జిగా ఉన్న ఇంద్రజ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమేంటి..? అని కొందరు ప్రశ్నించారు. దీంతో ఇంద్రజ తనతో సుధీర్ కు ఉన్న రిలేషన్ పై కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: SS Rajamouli: రాజమౌళి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

    సుడిగాలి సుధీర్ చేసే స్కిట్స్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకునేవి. ఆయన ఎక్కువగా లవ్ స్కిట్లు ఎంచుకోవడంతో యూత్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఈ సమయంలో ఆయనకు తోటి నటులు కూడా అభిమానులుగా మారిపోయారు. నటులు, ఫ్యాన్సే కాకుండా జడ్జిలుగా ఉన్న సుధీర్ కు ఫ్యాన్స్ గా మారారు. వీరిలో ఇంద్రజకు సుధీర్ చేసే నటన చాలా బాగా నచ్చుతుందట. ఆయన స్కిట్ రాగానే ఉత్సాహంగా ఫీలవుతుందని చెబుతోంది. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుధీర్ కు, మీకున్న రిలేషన్ ఏంటి..? అని కొందరు అడిగారు. దీంతో ఆమె చెప్పిన సమాధానాలకు షాక్ అయ్యారు.

    Sudigali Sudheer- Indraja

    సుధీర్ ను ముద్దుగా సిద్దూ అని పిలుస్తానని ఇంద్రజ చెప్పింది. సుధీర్ ను నేను కొడుకులాగా చూస్తానని, మా ఇద్దరి మధ్య తల్లీ కొడుకుల అనుబంధం ఉందని తెలిపింది. జబర్దస్త్ షో లో కెవ్వు కార్తీక్ ఓ షో చేసిన సమయంలో కార్తీక్… సుధీర్ లాగా కళ్లద్దాలు పెట్టుకునేటప్పుడు తనకు సుధీర్ గుర్తుకొచ్చాడని, దీంతో కన్నీళ్లు వచ్చేశాయని తెలిపింది. ఎంత ఆపుకున్నా కన్నీళ్లు ఆగలేదని ఇంద్రజ చెప్పింది. సుధీర్ లేకపోవడం ఎంతో బాధగా ఉందని ఇంద్రజ పేర్కొంది.

    ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఇంద్రజ శతమానం భవతి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రీ ఎంట్రీ ఇచ్చారు. అటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కామెడీ షో లు చేస్తోంది. అయితే చాలా మంది ఇంటర్వ్యూలు చేసినప్పుడు తన వ్యక్తిగత విషయాలు చెప్పని ఇంద్రజ సుడిగాలి సుధీర్ విషయంలో ఓపెన్ అయింది. ఏ నటుడి కోసం కన్నీళ్లు పెట్టుకొని ఆమె సుధీర్ గురించి ఎమోషనల్ అవడం టీవీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ మా టీవీలో ఓ కామెడీ షో తో బిజీగా ఉన్నాడు. ఈటీవీని వీడి ఇతర టీవీల్లో షోలు చేస్తున్నాడు. అటు ‘గాలోడు’, తదితర సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

    Also Read: NTR Sensational Decision: స్క్రిప్ట్ విషయం లో కొరటాల గందరగోళం..సంచలన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్

    Tags