SS Rajamouli: తెలుగు సినీ పరిశ్రమలో దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా తీస్తున్నారంటే అందరి అంచనాలు పెరిగిపోతున్నాయి. హీరోలకు స్టార్ డమ్ కల్పిస్తున్న దర్శకుడు రాజమౌళినే. స్టూడెంబ్ నెంబర్ వన్ నుంచి ఇప్పటి వరకు అపజయమే ఎరుగని రాజమౌళి సినిమా ఒప్పుకున్నాడంటే అది బ్లాక్ బస్టరే. తెలుగులో రాంచరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ లకు ప్యాన్ ఇండియా స్టార్లుగా చేసిన దర్శకుడు రాజమౌళి. రాంచరణ్ తో మగధీర చేసినప్పుడు తెలుగులో బ్రహ్మాండమైన హిట్ గా నిలిచింది.
తరువాత ప్రభాస్ తో తీసిన బాహుబలి రెండు భాగాలు కూడా తనదైన శైలిలో విజయం సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించాయి. ఈ సినిమాలతో వేల కోట్లు ఖర్చు చేసిన తిరిగి రాబట్టుకోవచ్చనే ధైర్యం నిర్మాతల్లో కలిగింది. అందుకే బాహుబలి రెండు భాగాలు విజయవంతమై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. దీంతో రాజమౌళిపై అందరి దృష్టి పడింది. ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ కు కూడా ప్యాన్ ఇండియా హోదా కల్పించి ఆయనలో కూడా విశ్వాసాన్ని పెంచిన ఘనత రాజమౌళితే.
Also Read: Sharukh Khan Movie : తండ్రీ కోసం దీపిక పడుకొణే, కొడుకు కోసం నయనతార
ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమా అంటే ఓ క్రేజీ ఏర్పడింది. ఆయస సుదీర్ఘ ప్రయాణంలో అపజయం మచ్చుకైనా కనిపించలేదు. రాజమౌళి తీరుతో స్టార్ డైరెక్టర్లు సైతం నివ్వెరపోతున్నారు. శంకర్ శిష్యుడిగా ప్రస్థానం కొనసాగించిని ప్రస్తుతం గురువును మించిన శిష్యుడిగా రాజమౌళి తన సినిమాల నిర్మాణంలో ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలుస్తోది. సినిమా రంగాన్ని తనదైన శైలిలో మెప్పిస్తున్నా రాజమౌళి పనితీరుకు అందరు ఫిదా అవుతున్నారు. అతడి దర్శకత్వ పర్యవేక్షణకు ఆశ్చర్యపోతున్నారు.
రాజమౌళి కూడా గతంలో స్టూడెంట్ నెంబర్ వన్ విడుదలయ్యాక ఓ సినిమా తమిళనటుడు మోహన్ లాల్ తో చేయాలని సంకల్పించారు. కథ కూడా రెడీ అయింది. కానీ సినిమా ఎందుకో కానీ పట్టాలెక్కలేదు. అదే సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కుమారుడు సూర్యప్రకాశ్ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేసినా అది కూడా ముందుకు సాగలేదు. దీంతో రాజమౌళి కాస్త ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రెండో సినిమానే ఇలా నిరాశ పరిచిందని ఆశ్చర్యపోయాడట. కానీ తరువాత తన ప్రస్థానాన్ని ఆపకుండా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read:Bandla Ganesh Satires On Pavan:పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్న బండ్ల గణేష్