https://oktelugu.com/

Actor Indraja: ఆమెను మరో రంగమ్మత్తను చేస్తావేంటి సుక్కు ?

Actor Indraja:  ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి.. బాగానే హిట్ అయ్యింది. ప్రస్తుతం ‘పుష్ప పార్ట్ 2’ పై సుకుమార్ కసరత్తులు స్టార్ట్ చేశాడు. అయితే, ‘పుష్ప 2’లో కొత్త నటీనటులను సుక్కు తీసుకోబోతున్నాడు. ఈ క్రమంలో మాజీ హీరోయిన్ ను కూడా ఫైనల్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 17, 2022 / 04:07 PM IST
    Follow us on

    Actor Indraja:  ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయి.. బాగానే హిట్ అయ్యింది. ప్రస్తుతం ‘పుష్ప పార్ట్ 2’ పై సుకుమార్ కసరత్తులు స్టార్ట్ చేశాడు. అయితే, ‘పుష్ప 2’లో కొత్త నటీనటులను సుక్కు తీసుకోబోతున్నాడు. ఈ క్రమంలో మాజీ హీరోయిన్ ను కూడా ఫైనల్ చేశాడు.

    Actor Indraja

    90ల్లో హీరోయిన్‌ గా పేరు తెచ్చుకున్న నటి ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెర పై బాగానే హడావిడి చేస్తోంది. అయితే, తాజాగా ఇంద్రజకు భారీ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది. పుష్ప పార్ట్‌ 2లో ఓ కీలక పాత్ర కోసం సుక్కు ఇంద్రజ తీసుకున్నాడు. ‘పుష్ప 2′ కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ క్రమంలో ఇంద్రజ బన్నీ పాత్రకు పిన్ని పాత్రలో కనిపించబోతుంది.

    Also Read:  ఆ విషయంలో వర్మను స్ఫూర్తిగా తీసుకున్నాను – రాజమౌళి

    ఇంతకీ, సుక్కు – బన్నీ ‘పుష్ప2’ పై ఏం చేయనున్నారు ? అనే కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు. నిజానికి అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌ అంటేనే ఫుల్ క్రేజ్. అంచనాలు బారీగా ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడం అంత ఈజీ కాదు. అందుకే, ‘పుష్ప’ పార్ట్ 1 టాక్ విషయంలో మొదట కాస్త మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

    ఏది ఏమైనా పార్ట్ 1 అంచ‌నాల‌ను అందుకోలేకపోయింది. కానీ, కమర్షియల్ గా బాగానే కలెక్ట్ చేసింది. అందుకే, పార్ట్ 2 పై నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. కానీ ‘పుష్ప పార్ట్ 2’ పై భారీ ఒత్తిడి ఉంది. ఎలాగూ పార్ట్ 2కి సంబంధించిన షూటింగ్ కూడా సగం అయిపోయింది. మరి ఇప్పుడు మార్పులు చేర్పులు చేసి సుక్కు ఈ పార్ట్ 2 ను ప్లాన్ చేస్తున్నాడు.

    Actor Indraja

    మరి ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వస్తోందో చూడాలి. సరే ఎలా వచ్చినా నటి ఇంద్రజకు మాత్రం మంచి క్యారెక్టర్ దొరికింది. ఇప్పటికే బుల్లితెరపై అలరిస్తున్న ఆమె ‘స్టాండప్‌ రాహుల్‌’ సినిమాలో హీరో రాజ్‌ తరుణ్‌ కు తల్లి పాత్రలో కూడా కనిపించబోతుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనది అట. మొత్తానికి సుక్కు చూపు ఈ సారి ఇంద్రజ పై పడింది. మరి ఆమెను మరో రంగమ్మత్తను చేస్తాడేమో.

    Also Read: ఆ అందాల తార అద్దంలో మొహం కూడా చూసుకోలేకపోయింది !

    Tags