Sakshi News Paper: ప్రింట్ మీడియా పరిస్థితి అద్వానంగా మారుతోంది. అంతా డిజిటల్ మయం అయిపోతున్న నేపథ్యంలో ప్రింట్ మీడియా ప్రాధాన్యం క్రమంగా తగ్గుతోంది. దీనికి తోడు కేంద్రం కూడా పన్నులు వేస్తుండటంతో పత్రికలు నడపలేని స్థితిలో పడిపోతున్నాయి. అందుకే పేజీలు తగ్గించుకుంటున్నాయి. కొన్ని పత్రికలైతే ఇక డిజిటల్ కే వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాక్షి కూడా అదే తోవలో ప్రయాణిస్తోంది. పేపర్ సర్క్యులేషన్ పెంచుకునేందుకు నానా తంటాలు పడుతోంది.

సర్క్యలేషన్ పెంచుకునే విధానంలో భాగంగా సాక్షి వినూత్న పథకాలకు తెర తీస్తోంది. రూ. వెయ్యి కడితే ఏడాదిపాటు పత్రిక వేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో తన పత్రిక సర్క్యులేషన్ ను పెంచుకుని తామే ప్రథమ స్థానంలో ఉన్నామని తెలియజెప్పేందుకు తయారవుతోంది. వ్యూహాత్మకంగా ఇలా చేయడంపై అందరిలో ఆశ్చర్యం వేస్తోంది. ఏడాది పాటు పోగైన పేపర్ ను అమ్మినా ఎక్కువ డబ్బులే వచ్చే సూచనలుండటంతో సాక్షి స్కీమ్ పై ఇప్పటికే అనుమానాలు వస్తున్నాయి.
Also Read: Congress Party: శరణు కోరినవారే భస్మాసూర ‘హస్తం’ అంటున్నారు..!
తన మనుగడ కోసం కళాశాలలు, యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకుని పేపర్ చందాలు చేయించుకునేందుుక ప్రాధాన్యం ఇష్తోంది. ఉద్యోగులను కూడా ఇందులో భాగస్వాములను చేసుకుంటూ తన ఉద్దేశం నెరవేర్చుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే పేపర్ సర్క్యులేషన్ పెంచుకోవాలని భావిస్తోంది. పేపర్ వేయించుకునే వారికి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. పేపర్ ఇంత దిగజారిపోవడంపై అందరిలో సంశయాలు వస్తున్నాయి.

ప్రింట్ మీడియా ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా ప్రభావంతో పేపర్ ల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. సర్క్యులేషన్ నిలబెట్టుకునే క్రమంలోనే రూ. వెయ్యికే ఏడాదిపాటు పేపర్ వేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా భవిష్యత్ లో పేపర్లు ఎన్ని పథకాలు తీసుకొచ్చి తమ మనుగడ కోసం తాపత్రయ పడతాయో తెలియడం లేదు. కానీ ఇంకా రెండు మూడు సంవత్సరాల్లో పేపర్లు మూతపడతాయనే వాదన కూడా వస్తోంది.
Also Read: Kapu Reservation: ఏపీని ‘కాపు’ కాస్తానంటున్న బీజేపీ.. కేంద్రం ప్రకటనతో ఇరుక్కున వైసీపీ!