మ్యాటర్ ఉండి కూడా సరైన సక్సెస్ రాకపోతే కలిగే బాధ, ఎదిగే అవకాశం ఉండి కూడా సరిగ్గా ఎదగలేకపోతే రగిలే ఆవేదన.. రెండు మాటల్లో చెప్పుకునేది కాదు. ఆ బాధ ఆవేదన రెండూ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణలో నిత్యం పోటీ పడుతూ ఉంటాయి. ‘వి’ సినిమాతో భారీ హిట్ కొట్టి, తన చిరకాల కోరిక తీర్చుకుని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో సగర్వంగా తన పేరును చూసుకోవాలని ఇంద్రగంటి ఎంతో ఆశ పడ్డాడు.
కానీ ‘వి’ సినిమా ఇంద్రగంటి స్థాయిని మరింతగా తగ్గించింది. దాంతో ఆయన తన తరువాత ఏం చేయాలి అనే క్వశ్చన్ దగ్గరే ఎంతో మధనపడి మొత్తానికి హీరో సుధీర్ బాబుతో ఒక సినిమాని సెట్ చేసుకున్నాడు. మరో ఐదు నెలల్లో ఈ సినిమా పూర్తవుతుంది. మరి ఆ తరువాత ఏ సినిమా చేయాలి ? అప్పుడు కూడా చిన్నాచితకా హీరోలతోనే సినిమాలు చేస్తే ఇక ఇన్నేళ్ల తన సినీ ప్రయాణానికి అర్ధం ఏముంటుంది ?
ఇలాంటి ప్రశ్నలతో ఇంద్రగంటి ప్రస్తుతం సతమతమవుతున్నాడట. వాస్తవానికి ‘వి’ సినిమా తరువాత ఇంద్రగంటి నాగ చైతన్యతో సినిమా చేయాల్సి వుంది, దిల్ రాజు బ్యానర్ లో చైతన్య హీరోగా సినిమా అనుకున్నారు. ఎప్పుడైతే ‘వి’ సినిమా డిజాస్టర్ అయిందో.. ఇక ఇప్పట్లో చైతుతో సినిమా చేయడం సాధ్యం కాదు అని ఇంద్రగంటికి అర్ధమైంది. దాంతో సుదీర్ బాబుతో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు.
అయితే, తాజాగా చైతు నుండి ఇంద్రగంటికి ఫోన్ వెళ్ళింది. ప్రస్తుతం తానూ చేస్తోన్న సినిమాలు పూర్తి అవుతున్నాయని.. కథ ఉంటే చెప్పండి, నచ్చితే సినిమా చేద్దాం అని చైతు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే, కొత్తగా ఒప్పుకున్న సినిమాలు కూడా పూర్తి అవ్వడానికి మరో ఏడాది పడుతుందని.. ఈ లోపు ఫుల్ స్క్రిప్ట్ ఫినిష్ చేయండని చైతు అన్నాడట. చైతుతో సినిమా అంటే ఏడాది అయినా వెయిట్ చేయొచ్చు అనే ఆలోచనలో వున్నాడు ఇంద్రగంటి. కాబట్టి వచ్చే ఏడాది వీరి కలయికలో ఓ సినిమా రానుంది.