Cheera Meenu Price : బొమ్మిడాయిలు తెలుసు.. కొరమీన్లూ తెలుసు.. మరి ఈ చీరమేన్లు ఏంటి కొత్తగా? దీపావళి ముందు ఎందుకు జనం ఎగబడుకుంటున్నారు..

మటన్ తినని వాళ్ళు, చికెన్ ఇష్టపడని వాళ్లు చేపలను హాయిగా తింటారు. లొట్టలు వేసుకొని మరీ ఆరగిస్తారు. చేపల్లో క్యాల్షియం ఉంటుంది. అన్నింటికీ మించి కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్లే చాలామంది చేపలను తినడాన్ని ఇష్టపడుతుంటారు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 28, 2024 7:08 pm

Cheera Meenu Price

Follow us on

Cheera Meenu Price : చేపల్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలలో కొర్రమీను టాప్ ప్లేస్ లో ఉంటుంది. మార్కెట్లో కొర్రమీనుకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా దాని ధర ఎప్పుడూ ఒక రేంజ్ లో ఉంటుంది. మత్స్యకారులు చేపలలో కొర్రమీన్లను రారాజులు అని పిలుస్తుంటారు. అయితే యానం మార్కెట్లో మాత్రం కొర్రమీన్లకు మించి ఓ చేప రేటు పలుకుతోంది. దాని పేరు చీర మేను.. దీపావళికి ముందే ఈ చేపలు మార్కెట్ కు పోటెత్తడంతో మాంసాహారులు కొనుగోలు చేయడానికి క్యూ కడుతున్నారు.

రూపంలో చిన్నది

చీర మీద ఆకారంలో చాలా చిన్నది. కానీ మాంసాహార ప్రియులు దీనిని లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇది ఏడాది మొత్తం లభ్యం కాదు. కేవలం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే అమావాస్య సమయంలోనే లభిస్తుంది. ఈ కాలంలో సముద్ర తీరం నుంచి తూర్పు గాలులు వీస్తాయి. ఆ ప్రభావం వల్ల గుంపులు గుంపులుగా ఈ చేపలు నీళ్ల పైకి వస్తాయి. ఆ సందర్భంలో నురుగు తెట్టు నీటిపై కడుతుంది. అందులో దాగివున్న చీర మేను చేపలను మత్స్యకారులు వలలు వేసి పడతారు. చీర మేను చేపల్లో అత్యంత చిన్నది. దీని జీవిత కాలం కూడా గంటల సమయం వరకే ఉంటుంది. నీటిపై తేలి ఆడుతూ ఉంటుంది కాబట్టి.. పైగా ఇది రూపంలో అత్యంత చిన్నగా ఉంటుంది కాబట్టి దీనిని చీరమేను అని మత్స్యకారులు పిలుస్తుంటారు. వీటిని వేటాడేందుకు వేసే వలలు కూడా అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. అయితే వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల గత ఐదు సంవత్సరాలలో చీరమేను జాడ కనిపించలేదు. అయితే ఈసారి మాత్రం మత్స్యకారులకు భారీగానే చీర మేను చేపలు లభించాయి. దీంతో ప్రసిద్ధ యానం చేపల మార్కెట్ చీర మేను చేపలతో సందడిగా మారింది. వీటిని కొనుగోలు చేయడానికి మాంసాహార ప్రియులు క్యూలు కడుతున్నారు.

యానాం అనేది కాకినాడ జిల్లాలో కేంద్రపాలిత ప్రాంతం. ఇక్కడ చీరమేను చేపలకు గౌతమి గోదావరి తీరంలో వేలంపాట నిర్వహిస్తున్నారు. ఈసారి చీర మీను చాపలు భైరవపాలెం దర్యాలతిప్ప లో భారీగా లభించాయి. ఈ ప్రాంతం గోదావరి నది పాయలు సముద్రంలో కలిసే చోట ఉంటుంది. ఇక్కడ మత్స్యకారులు వలలు వేయడంతో భారీగా చీర మేను చేపలు లభ్యమయ్యాయి. ఈసారి చేపలు భారీగా రావడంతో బకెట్ ధర పడిపోయింది. కేవలం 10 నుంచి 12 వేలలోనే లభ్యమైంది. గతంలో చేపలు లభించకపోవడంతో బకెట్ ధర 30 నుంచి 40 వేల వరకు వెళ్ళింది. అయితే బకెట్ కొనుగోలు చేయలేని వారికోసం కిలోల లెక్కన కొలిచి ఇస్తున్నారు. ఒక్కో కిలో 2000 వరకు విక్రయిస్తున్నారు