https://oktelugu.com/

Pushpa Tweets: ‘పుష్ప’పై ఊహించని కామెంట్ చేసిన ఇండియన్ క్రికెటర్..!

Pushpa Tweets: ‘అలవైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లతోపాటు ప్రశంసలను దక్కించుకుంటోంది. ఈ మూవీపై పలువురు సెలబ్రెటీలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయగా తాజాగా మరో ఇండియన్ క్రికెటర్ ‘పుష్ప’ను ప్రశంసలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కింది. బన్నీ తొలిసారి డీ గ్లామర్ రోల్ చేయగా అతడి నటనపై […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 8, 2022 / 02:53 PM IST
    Follow us on

    Pushpa Tweets: ‘అలవైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ ‘పుష్ప’తో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కలెక్షన్లతోపాటు ప్రశంసలను దక్కించుకుంటోంది. ఈ మూవీపై పలువురు సెలబ్రెటీలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయగా తాజాగా మరో ఇండియన్ క్రికెటర్ ‘పుష్ప’ను ప్రశంసలతో ముంచెత్తడం చర్చనీయాంశంగా మారింది.

    Pushpa

    ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కింది. బన్నీ తొలిసారి డీ గ్లామర్ రోల్ చేయగా అతడి నటనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా లో బన్నీ వన్ మ్యాన్ షోతో అలరించగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, సమంత స్పెషల్ సాంగ్, రష్మిక మందన్న గ్లామర్ సినిమాకు అడ్వాంటేజ్ గా మారాయి. దీంతో ఈ మూవీ నాలుగో వారంలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది.

    విడుదలకు ముందే భారీ బిజినెస్ చేసిన ‘పుష్ప’ ఇప్పటికే సేఫ్ ప్లేస్ చేరుకుంది. దీంతో ‘పుష్ప-2’ కూడా పట్టాలెక్కడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ మూవీలో ‘పుష్ప రాజ్’ క్యారెక్టర్ ను ప్రముఖ క్రికెటర్ షేన్ వార్న్ ఫేస్ యాప్ టెక్నాలజీతో ఒక వీడియో చేయగా అది నెట్టింట్లో వైరల్ అయింది. తాజాగా ఇండియన్ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ‘పుష్ఫ’ మూవీపై ఊహించని కామెంట్ చేశాడు.

    ‘పుష్ప’ మూవీని తాజాగా తిలకించినట్లు హైదరాబాద్ కు చెందిన ప్రజ్ఞాన్ ఓజా ట్వీటర్లో తెలిపాడు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘అప్పట్లో పుష్పలో.. నాకు కన్నీళ్లు నచ్చవు అనే బ్లాక్‌బస్టర్ డైలాగ్ ఉండేదని.. ఇప్పుడు పుష్ప.. పుష్పరాజ్.. నీఅవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ వచ్చింది.. నిజంగా నీ యాక్టింగ్ నాకెంతో నచ్చింది అల్లు అర్జున్’ అంటూ ప్రజ్ఞాన్ ఓజా ట్వీట్ చేశాడు. ‘పుష్ప’ను నిర్మాతలు, దర్శకులను ప్రశంసించాడు. దీనికి ప్రతీగా బన్నీ ‘థ్యాంక్స్ ప్రజ్ఞాన్ ఓజా గారూ’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.