
India Today Conclave : Ram Charan : #RRR మూవీ కి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత మూవీ టీం మొత్తం హైదరాబాద్ కి వచ్చేసింది.కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇంకా ఖాళీ అవ్వలేదు,తాను నటించిన సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం తో ఇండియా టుడే ప్రతీ ఏడాది ఎంతో ప్రతిష్ఠటంకంగా భావించి నిర్వహించే కాంక్లేవ్ మీటింగ్ కి రామ్ చరణ్ ఒక గెస్ట్ గా విచ్చేశాడు.
ఇది తెలుగు వాడిగా రామ్ చరణ్ కి దక్కిన మరో అరుదైన గౌరవం గా చెప్పుకోవచ్చు.ఈ మీటింగ్ కి రామ్ చరణ్ తో పాటుగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి దిగ్గజాలు కూడా పాల్గొన్నారు.అయితే అందరి కంటే ముందు రామ్ చరణ్ తోనే ఈ ఇష్టాగోష్టి కార్యక్రమం జరిగింది.ఆయనతో కాసేపు #RRR మూవీ ముచ్చట్లు, అలాగే భవిష్యత్తు లో తాను చెయ్యబొయ్యే సినిమాల గురించి చెప్పుకొచ్చాడు.
ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ కి రామ్ చరణ్ తో పాటుగా ఉపాసన కూడా హాజరయ్యింది.అయితే మొట్టమొదటిసారి ఆమె వేదిక మీద స్పీచ్ ఇస్తుండడం తో కాస్త తడబడింది.రామ్ చరణ్ ని పొగుడుతూ సిగ్గు పడింది, చిక్కింది ఛాన్స్ అనుకోని రామ్ చరణ్ కాసేపు ఆమెని సరదాగా స్టేజి మీద ఆట పట్టించాడు.
ఇది చూసేందుకు చాలా చక్కగా అనిపించింది.ఈవెంట్ కి హాజరైన వాళ్ళందరూ చప్పట్లతో మారుమోగిపోయ్యేలా చేశారు.కేవలం ఇదొక్కటే కాదు , రామ్ చరణ్ #RRR మూవీ తో తనకి ముడిపడున్న జ్ఞాపకాలను కాసేపు నెమరువేసుకున్నారు,వాటితో పాటు ఆయన భవిష్యత్తులో చెయ్యబొయ్యే సినిమాల గురించి , మరియు వివిధ అంశాల గురించి కూడా చెప్పుకొచ్చాడు.ఈ లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.