Inaya Sultana: బిగ్ బాస్ 6 లో గత కొంతకాలం నుండి కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..గత వారం సూర్య ఎలిమినేట్ అయిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వారం మొత్తం సూర్య ఎలిమినేషన్ అంశం ని అడ్డుపెట్టుకొనే ఇంటి సభ్యులు ఆడడం జరిగింది..ముఖ్యంగా నామినేషన్స్ లో ఇనాయ ని ఈ కోణం లోనే అందరూ నామినేట్ చేసారు..సూర్య ని బయటకి పంపడం కోసం ఆమె అతనిని ఏమార్చి, తన గేమ్ ని నాశనం చేసి ఇంటి నుండి బయటకి పంపేసింది అనే విషయం చెప్పి ఆదిరెడ్డి నామినేట్ చెయ్యడం తో ఇనాయ గేమ్ మొత్తం బయటపడిపోయింది.

నిజం బయటపడేలోపు ఇప్పుడు ఇనాయ ఆడియన్స్ లో మార్కులు కొట్టేయడానికి కొత్త గేమ్ మొదలెట్టింది..సూర్య అంటే తనకి ఎంత ప్రేమనో చెప్పడానికి..తన మీద పడిన ఆ నిందలు చెరిపివేయ్యడానికి ఆమె నానా తంటాలు పడుతుంది..ఇప్పుడు లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమో లో ఆమె చేసిన ఓవర్ యాక్షన్ మరోసారి ఆమెపై సోషల్ మీడియా లో నెగటివ్ కామెంట్స్ వచ్చేలా చేస్తుంది.
ఇక అసలు విషయానికి ఇనాయ వంట గదిలోకి వచ్చి ‘సూర్య ప్లేట్ ఏమైంది..నేను రోజు అందులోనే తింటున్నా కదా..ఎవరు ఆ ప్లేట్ తీసేసారు’ అంటూ గొడవకి దిగుతుంది..’ఛీ! నాకు ఈ ఇంట్లో తినడానికి కూడా ఇష్టపడడం లేదు’ అంటూ తెగ గొడవ చేసేస్తుంది..ఆ తర్వాత మెరీనా ఆమెని బ్రతిమిలాడి అన్నం పెడుతుంది..’సూర్య ఫీల్ అవుతాడు..అతని కోసం తిను’ అంటూ అన్నం పెడుతుంది.

నిన్న కూడా ఆమె ఆడియన్స్ దగ్గర నుండి మార్కులు కొట్టేయడానికి సూర్య టీ షర్ట్ వేసుకొని గేమ్ ఆడుతుంది..ఆ విషయం ఆడియన్స్ కి అర్థం అవ్వడం కోసం ‘ఏంటి సూర్య ఇలా గుర్తుకువస్తున్నావ్..ఏ పని చేసిన నీ మెమోరీస్ మాత్రమే గుర్తుకు వస్తున్నాయి..ఈరోజు నువ్వు ఇచ్చిన టీ షర్ట్ వేసుకొనే ఆడాను’ అంటూ కెమెరా కి కనపడే విధంగా చెప్పుకుంది..ఇప్పుడు ఎన్ని నాటకాలు ఆడినా వేస్ట్..తన గురించి మొత్తం బయటపడిపోయింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.