https://oktelugu.com/

Bhagwant Kesari Tamil Remake : భగవంత్ కేసరి’ రీమేక్ లో తమిళ హీరో విజయ్..’శ్రీలీల’ పాత్రలో మెరవనున్న హాట్ బ్యూటీ!

గత ఏడాది నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో బాలయ్య కి కూతురుగా శ్రీలీల నటన కూడా అందరినీ ఎంతో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ సినిమాని ఇప్పుడు విజయ్ తమిళం లో రీమేక్ చేయబోతున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 1, 2024 / 10:04 PM IST

    Bhagwant Kesari Tamil Remake

    Follow us on

    Bhagwant Kesari Tamil Remake : సౌత్ ఇండియా లో అత్యధిక రీమేక్ సినిమాలు చేసిన నేటి తరం స్టార్ హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు తమిళ హీరో విజయ్. ఈయన గతంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్ సినిమాలను రీమేక్స్ చేసి సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. అంతే కాదు ఈయన తెలుగు లో సూపర్ హిట్ అయిన సాంగ్స్ తో పాటుగా, ఆ సాంగ్స్ లో హీరోలు వేసే స్టెప్పులను కూడా రీమేక్ చేసేవాడు. అలాంటి విజయ్ ఇప్పుడు రీమేక్ సినిమాలకు దూరంగా, క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ బాక్స్ ఆఫీస్ ని ఒక రేంజ్ లో దున్నేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన చివరిసారిగా చేసిన రీమేక్ చిత్రం ‘స్నేహితుడు’. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరో గా నటించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘3 ఇడియట్స్’ కి ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కింది. ఇదంతా పక్కన పెడితే విజయ్ ఇప్పుడు మరోసారి రీమేక్ సినిమా చేయబోతున్నాడు అనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే గత ఏడాది నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో బాలయ్య కి కూతురుగా శ్రీలీల నటన కూడా అందరినీ ఎంతో ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ సినిమాని ఇప్పుడు విజయ్ తమిళం లో రీమేక్ చేయబోతున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో శ్రీలీల క్యారక్టర్ లో ‘ప్రేమలు’ హీరోయిన్ ‘మమిత బైజు’ నటించనుంది. అలాగే కాజల్ అగర్వాల్ పాత్రను ప్రముఖ హీరోయిన్ పూజ హెగ్డే చేయబోతుందట. అలాగే భగవంత్ కేసరి చిత్రం లో విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ చేసాడు. ఈ చిత్రంలో ఆయనకు బదులుగా బాబీ డియోల్ ని తీసుకున్నారు. ఈ సినిమానే విజయ్ ఆఖరి చిత్రం అవ్వబోతుండడం విశేషం.

    ఈ సినిమా తర్వాత ఆయన తన పార్టీ ని 2026 ఎన్నికల కోసం సిద్ధం చేయబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియన్ సినిమా యుగంలో ఇలాంటి రీమేక్ సినిమాలను ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ విషయం లో మాత్రమే రీమేక్ సినిమాలు ఇప్పటికీ కూడా వర్కౌట్ అయ్యాయి. విజయ్ కి కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ స్టార్ స్టేటస్ ఉండడంతో కచ్చితంగా ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం తో ఉంది ట్రేడ్. ఇటీవలే ఆయన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది.