https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 సినిమాలో పోలీసులనే టార్గెట్ చేశారు…ఇప్పుడు ఈ రెండు సీన్ల మీదనే చర్చ నడుస్తుందా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అల్లు అర్జున్ చేసిన పుష్ప 2 సినిమా భారీ రికార్డును క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక బాహుబలి 2 సినిమా సాధించిన 1900 కోట్ల రికార్డును ఈ సినిమా తొందర్లోనే బ్రేక్ చేయబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారడనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : December 24, 2024 / 10:07 AM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీకి గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికి హీరోగా ఆయనకి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్య సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒక ఎత్తైతే పుష్ప 2 సినిమాతో ఆయన క్రియేట్ చేసిన ప్రభంజనం మరొకెత్తనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా మామూలు విజయం సాధించలేదు. పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తూ భారీ రికార్డ్ లను సైతం క్రియేట్ చేస్తుందనే చెప్పాలి. మరి అలాంటి సినిమా చేసినందుకు అల్లు అర్జున్ చాలా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా మార్కెట్ పరంగా కూడా ఆయన చాలా గొప్ప మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమాల మీద కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది… ఇక పుష్ప సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసినప్పటికి ఈ సినిమాలో కొన్ని సీన్ల మీద చాలావరకు వ్యతిరేకత అయితే వస్తుంది. ఇంతకీ ఆ సీన్లు ఏంటి అంటే భన్వర్ సింగ్ శేకావత్ లాంటి ఐపీఎస్ కేటగిరి ఉన్న పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో ఉన్నప్పుడు స్మగ్లర్ అయిన పుష్ప రాజ్ అందులో మూత్రం పోయడం ఆ మూత్రం పోసిన నీళ్లలో బన్వర్ సింగ్ షెకావత్ ఉంటాడు.

    అలాగే పుష్ప పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసోళ్ళను డబ్బులతో కొనడం లాంటి సీన్లను చూస్తుంటే పోలీస్ వాళ్ళను టార్గెట్ చేసి మరి ఈ సినిమాలో పెట్టినట్టుగా కొంతమంది భావిస్తున్నారు దానివల్లే ఈ సినిమా మీద తీవ్రమైన చర్చలైతే నడుస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సీన్లను తొలగించాలని కొన్నిచోట్ల కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికి వీటి మీద సినిమా యూనిట్ మాత్రం ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.

    ఇక రీసెంట్ గా తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ క్యాండేట్ కూడా పుష్ప 2 సినిమాలో పోలీసులను టార్గెట్ చేస్తూ కొన్ని సీన్లను తొలగించాలని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు. దీని మీద సినిమా యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి స్పందనను అయితే తెలియజేయలేదు. మరి ఇకమీదట వాళ్ళు ఈ సీన్ల మీద ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది…