https://oktelugu.com/

Pawan Kalyan : స్టార్ హీరోయిన్ కి 24 లక్షల వజ్రాల హారం అందించిన పవన్ కళ్యాణ్..ఆమె ఎవరో చూస్తే ఆశ్చర్యపోతారు!

పవన్ కళ్యాణ్ ఒక సన్నివేశం లో హీరోయిన్ కోసం 24 లక్షల రూపాయిలు విలువ చేసే వజ్రాల హారాన్ని దొంగతనం చేసి బహుమతిగా ఇస్తాడట. ఆరోజుల్లో 24 లక్షలు అంటే, ఇప్పటి లెక్కల్లో కొన్ని కోట్ల రూపాయిలు ఉంటుంది. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందట

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 09:12 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan :  పాన్ ఇండియన్ హీరోలు ఇండస్ట్రీ లో ఎంతమంది అయినా ఉండొచ్చు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఢీ కొట్టే మరో స్టార్ హీరో లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హిట్టు, ఫ్లాప్ తో సంబంధం లేకుండా తదుపరి చిత్రానికి రికార్డు స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ పెట్టడం, కళ్ళు చెదిరే రేంజ్ లో ఓపెనింగ్స్ పెట్టడం పవన్ కళ్యాణ్ కి చాలా మామూలే. అభిమానులు ఆయనను ఒక దేవుడి లాగా కొలుస్తారు. 2019 తర్వాత కష్ట సమయంలో పవన్ కళ్యాణ్ ని వదలకుండా రెట్టింపు అభిమానంతో ఆయన కోసం బలంగా నిలబడ్డారు, కష్టపడి తిరిగారు, చివరికి గెలిపించుకొని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏ స్థాయిలో తన బాధ్యతలను చేపడుతూ ముందుకు దూసుకుపోతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం.

    ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరోయిన్ కోసం 24 లక్షల రూపాయిలు విలువ చేసే వజ్రాల హారం ని బహుమతిగా ఇచ్చాడట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఆయన ఆ బహుమతి ఇచ్చింది నిజ జీవితం లో కాదు. ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో..ఈ సినిమాలో ఆయన బందిపోటు దొంగగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంగళగిరి లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ చిత్రంలో కోహినూర్ వజ్రాన్ని దొంగలించే సన్నివేశం వేరే లెవెల్ లో ఉంటుందని టాక్. అలాంటి సన్నివేశాలు ఈ చిత్రం లో చాలానే ఉంటాయట. మొఘల్ సామ్రాజ్యానికి చెందిన యువరాణితో ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రేమాయణం నడుపుతాడు. ఆ పాత్రను ప్రముఖ యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ చేసిన సంగతి తెలిసిందే.

    ఇందులో పవన్ కళ్యాణ్ ఒక సన్నివేశం లో హీరోయిన్ కోసం 24 లక్షల రూపాయిలు విలువ చేసే వజ్రాల హారాన్ని దొంగతనం చేసి బహుమతిగా ఇస్తాడట. ఆరోజుల్లో 24 లక్షలు అంటే, ఇప్పటి లెక్కల్లో కొన్ని కోట్ల రూపాయిలు ఉంటుంది. సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందట. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత లవ్ ట్రాక్ ఉన్న సన్నివేశాలు చాలా తక్కువ చేసాడు. వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ లో చిన్న లవ్ ట్రాక్ పెట్టినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆ సన్నివేశం ప్రభావం చూపించలేకపోయింది. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో మాత్రం లవ్ ట్రాక్ చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఇది ఇలా ఉండగా సెప్టెంబర్ 23 వ తారీఖు నుండి 30 వ తారీఖు వరకు విరామం లేకుండా షూటింగ్ చేసిన పవన్ కళ్యాణ్, అక్టోబర్ 11 వ తేదీ నుండి మళ్ళీ షూటింగ్ ని తిరిగి ప్రారంభించబోతున్నారట, అక్టోబర్ 23 కి షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోబోతుంది.