https://oktelugu.com/

‘Swag’ Movie OTT :  శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..ఎక్కడ స్ట్రీమింగ్ అవ్వబోతుందంటే!

ఈ చిత్రం అనుకున్న తేదికంటే ముందే ఓటీటీ లో వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అమెజాన్ ప్రైమ్ సంస్థ 'స్వాగ్' మూవీ డిజిటల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనుగోలు చేసింది. ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి దీపావళి పండుగ రోజు విడుదల అవ్వాలి.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 09:24 PM IST

    'Swag' Movie OTT

    Follow us on

    Swag Movie OTT :  విభిన్నమైన కథాంశాలతో, ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న యంగ్ హీరోలలో ఒకరు శ్రీ విష్ణు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన ఆయన తొలుత క్యారక్టర్ రోల్స్ తో ఫేమ్ ని సంపాదించుకొని, ఆ తర్వాత హీరోగా మారాడు. ఈయన నటించిన ప్రతీ సినిమా కొత్త రకంగా ఉంటుంది. ప్రారంభంలో ఆ సినిమాలు థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీ లలో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అప్పటి నుండి శ్రీవిష్ణు సినిమాలు విడుదల అవుతుంది అంటే కచ్చితంగా బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ప్రేక్షకుల మదిలో నాటడడంలో ఆయన సక్సెస్ అయ్యాడు, అందుకే టాక్ తో సంబంధం లేకుండా ఈయన సినిమాలకు వెళ్లే ఆడియన్స్ ఏర్పడ్డారు.

    రీసెంట్ గానే ఈయన ‘సమజవరగమనా’, ‘ఓం భీం బుష్’ చిత్రాలతో వరుస సూపర్ హిట్స్ కొట్టి, ఇప్పుడు ‘స్వాగ్’ చిత్రం ద్వారా మన ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా విడుదలకు ముందే ఆకట్టుకుంది ఈ చిత్రం. విడుదల తర్వాత ఊహించిన దానికంటే సినిమా అద్భుతంగా ఉండడం తో టాక్ అదిరిపోయింది. ఓపెనింగ్స్ వసూళ్లు కూడా శ్రీ విష్ణు రేంజ్ కి పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో వచ్చాయి. ట్రేడ్ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. కానీ అనుకున్న రేంజ్ వసూళ్లు మాత్రం రాలేదు. కారణం ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రమే. ఈ సినిమాని చూసేందుకు ఆడియన్స్ 400 రూపాయిలు వెచ్చించి టికెట్స్ విక్రయించారు. వారం రోజులకు ముందు ఒక సినిమాని చూసేందుకు అంత డబ్బులు ఖర్చు చేసిన ఆడియన్స్, మరుసటి వారం ఒక చిన్న సినిమాకి టికెట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించరు. అందుకే ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ వచ్చాయి కానీ, సోమవారం నుండి మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి.

    దీంతో ఈ చిత్రం అనుకున్న తేదికంటే ముందే ఓటీటీ లో వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. అమెజాన్ ప్రైమ్ సంస్థ ‘స్వాగ్’ మూవీ డిజిటల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనుగోలు చేసింది. ముందు అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి దీపావళి పండుగ రోజు విడుదల అవ్వాలి. కానీ కలెక్షన్స్ పెద్దగా రాకపోతుండడం వల్ల ఈ చిత్రాన్ని ఈ నెల చివరి వారం లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా ఇలాంటి చిన్న చిత్రాలను థియేటర్స్ లో కాకుండా ఓటీటీ లో చూసేందుకు ఎక్కువ ఆశ్రయిస్తారు ఓటీటీ ప్రేక్షకులు. కరోనా లాక్ డౌన్ చేసిన అలవాటు ఇది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.