https://oktelugu.com/

Vaishnav Tej: మెగా బ్రదర్స్ చిన్నల్లున్ని పట్టించుకోవడం లేదా?

ఏ హీరో సాధించిన రికార్డు సాధించారు వైష్ణవ్ తేజ్. కానీ ఈ ఆనందం కొన్నాళ్లు కూడా దక్కలేదు. ఉప్పెన సినిమా తర్వాత రంగరంగ వైభవంగా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 25, 2023 / 04:00 PM IST

    Vaishnav Tej

    Follow us on

    Vaishnav Tej: మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి పరిచయం అవసరం లేదు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఈ మద్య కాలంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి డిజాస్టర్ లను చవిచూస్తున్న హీరోగా కూడా పేరు సంపాదించారు. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్ లతో బాధ పడుతున్నాడు వైష్ణవ్. మొదటి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన ఏ హీరో కూడా మొదటి సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధించలేదు.

    ఏ హీరో సాధించిన రికార్డు సాధించారు వైష్ణవ్ తేజ్. కానీ ఈ ఆనందం కొన్నాళ్లు కూడా దక్కలేదు. ఉప్పెన సినిమా తర్వాత రంగరంగ వైభవంగా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. చాలా ఆశలు పెట్టుకొని వచ్చిన ఆదికేశవ సినిమా కూడా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. ఏ స్థాయిలో వసూళ్లు ఉంటాయో మరో వారం గడిస్తే కానీ క్లారిటీ చెప్పలేం. మొత్తానికి ఆదికేశవ సినిమా కూడా పోయినట్టే అనే టాక్ ఉంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే వైష్ణవ్ తేజ్ సినిమాల ఎంపిక విషయంలో మామయ్యల సలహాలు లేవా అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

    ముగ్గురు మామయ్యలు కూడా బిజీగా ఉండడం వల్ల వైష్ణవ్ తేజ్ తన సినిమాలను తానే ఎంపిక చేసుకుంటూ ఉన్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం వైష్ణవ్ తేజ్ విషయంలో మెగా ఫ్యామిలీ లైట్ తీసుకుంటుందా అని విమర్శిస్తున్నారు. కథల ఎంపిక విషయంలో అన్నయ్య సాయి ధరమ్ తేజ్ ని అయినా ఫాలో అవ్వాలని మెగా ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. మొత్తానికి చిన్న అల్లుడు సెటిల్ అయ్యే వరకు కాస్త మామయ్యలు పట్టించుకుంటే బాగుండు కదా అంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఇప్పడైనా మామయ్యలు చిన్నల్లున్ని పట్టించుకుంటారా లేదా అనేది..